ChaySam : అందరి కళ్లూ ఆ డేట్ మీదే.. ఎందుకలా..?

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య - సమంతల వెడ్డింగ్ యానివర్శరీ గురించి అందరూ ఎందుకంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. కారణాలివేనా..?

ChaySam : అందరి కళ్లూ ఆ డేట్ మీదే.. ఎందుకలా..?

Chai Sam

Chai – Sam: అక్కినేని ఫ్యాన్స్, ఆడియన్స్ అలాగే సినీ ఇండస్ట్రీ అంతా ఒక డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అదే అక్టోబర్ 6. ఎందుకంటే యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంతల పెళ్లి రోజు అది. ఆ.. ఏముంది.. ప్రతి సంవత్సరం లానే ఈసారి కూడా ఇద్దరూ ఏదో ఒక ప్లేస్‌కి వెళ్లి సెలబ్రేట్ చేసుకుని వచ్చేస్తారు.. ఫ్యాన్స్, ఇండస్ట్రీ వాళ్లు చై-సామ్ పిక్స్‌తో సోషల్ మీడియాలో విషెస్ చెబుతారు అంతేగా అనుకుంటున్నారా..?

Samantha – Chaitanya : ఇద్దరి మధ్య ఏం జరిగింది..?

పేరు తీసెయ్యడం.. ఫ్రెండ్స్‌తో పార్టీలు..
ఒకవేళ ఇలాగే జరిగితే అంత వింతేముంది కానీ.. అసలు అందరూ ఆసక్తిగా ఎదురు చూడ్డానికి కారణం ఏంటంటే.. గతకొద్ది రోజులుగా వస్తున్న వార్తలు.. అలాగే ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేలా ఉన్న సమంత బిహేవియర్.. సమంత ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్స్‌లో తన పేరు పక్కన ఉన్న అక్కినేని పేరు తీసెయ్యడం.. కొద్ది రోజులు కేవలం స్నేహితులతో మాత్రమే ఔటింగ్, పార్టీలు వంటివి చేసుకోవడం.. ఇదంతా నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు నిజమనిపించేలా ఉన్నాయనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి..

Samantha : ‘లవ్ స్టోరీ’ ట్రైలర్‌పై సమంత రియాక్షన్.. డిఫరెన్స్ గమనించారా..?

చై రిప్లై ఇచ్చాడు.. నాగార్జున ఎందుకివ్వలేదు..?
‘లవ్ స్టోరీ’ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చైతు ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ.. ‘విన్నర్.. ఆల్ ది వెరీ బెస్ట్ టు ది టీమ్’.. అంటూ సాయి పల్లవిని ట్యాగ్ చేస్తూ #LoveStoryTrailer హ్యాష్ ట్యాగ్‌తో కామెంట్ చేసింది సమంత. రీ ట్వీట్‌లో భర్త పేరుని మెన్షన్ చెయ్యలేదని కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. చైతు ‘థ్యాంక్స్ సామ్’ అంటూ రిప్లై ఇవ్వడంతో.. విడిపోతున్నారనే వార్తల్లో నిజం లేదు అనుకున్నవాళ్లూ లేకపోలేదు..

సెప్టెంబర్ 20న అక్కినేని జయంతి సందర్భంగా ‘ఏఎన్నార్ లివ్స్’ అంటూ నాగ్ పోస్ట్ చేసిన ఈ వీడియోను రీ ట్వీట్ చేసింది సమంత. ‘ఇది చాలా అద్భుతంగా ఉంది మామా’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (నాగార్జున రిప్లై ఇవ్వలేదు).. ఇది చూసిన కొంతమంది సామ్, చై మధ్య ఏ గొడవా లేదు, ఒట్టి పుకార్లే అని ఆమెను వెనకేసుకొస్తున్నారు. మొన్నామధ్య నాగ్ బర్త్‌డే రోజున కూడా ఇలానే మామా అంటూ విష్ చేసింది. ఇలా సోషల్ మీడియాలో దగ్గరగా ఉన్నట్టే ఉండి అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఎందుకుండాల్సి వస్తుందో అర్ధం కావట్లేదు చాలా మందికి.

Samantha : ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’.. సమంత ఫైర్..

వెడ్డింగ్ యానివర్సరీ..
2017 అక్టోబర్ 6న చై – సామ్ మ్యారేజ్ చేసుకున్నారు. అక్టోబర్ 6న హిందు, అక్టోబర్ 7న క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వెడ్డింగ్ గ్రాండ్‌‌గా జరిగింది. అప్పటినుంచి ఇద్దరిలో ఎవరో ఒకరి బర్త్‌డేకి కానీ వెడ్డింగ్ యానివర్సరీకి కానీ గోవా లాంటి ప్లేసెస్‌కి వెళ్లి సెలబ్రేట్ చేసుకుంటుంటారు ఈ యంగ్ కపుల్. ఈ నేపథ్యంలో వచ్చే నెల 6వ తేది గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఆరోజు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడతారా.. లేక ఇద్దరూ కలిసి కనిపిస్తారా.. అసలు అక్కినేని కుటుంబంలో సమంత పాత్ర ఏంటి.. ఏం మార్పులు జరిగాయి.. ఎలాంటి విషయాలు తెలియబోతున్నాయి.. ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఆరవ తారీఖునే దొరుకుతుంది కాబట్టి ఆ డేట్ లాక్ చేసి పెట్టి ఎదురు చూస్తున్నారు అదీ సంగతి..

Chai Sam Family