Pushpa: రికార్డు టీఆర్పీతో తగ్గేదే లే అంటోన్న పుష్పరాజ్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప - ది రైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే...

Allu Arjun Pushpa Movie Record Trp On Small Screen
Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప – ది రైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఎదురుచూశారు. ఇక ఈ సినిమాను పక్కా కమర్షియల్ అంశాలతో సుకుమార్ తనదైన మార్క్ టేకింగ్‌తో తెరకెక్కించిన విధానం ప్రేక్షకులందరినీ కట్టిపడేసింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు.
Pushpa: ఈసారి బాలీవుడ్ భామతో ఊ అనిపిస్తోన్న పుష్ప..?
ఇక పుష్ప చిత్రం వసూళ్ల పరంగా కూడా బ్లాక్‌బస్టర్ కలెక్షన్స్ రాబట్టి బన్నీ స్టామినా ఏమిటో మరోసారి ప్రూవ్ చేసింది. కాగా పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా ఇతర భాషల్లో కూడా కళ్లుచెదిరే వసూళ్లు రాబట్టింది. అయితే ఇటీవల ఈ సినిమాను బుల్లితెరపై టెలికాస్ట్ చేశారు. పుష్ప చిత్రానికి బుల్లితెరపై కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు టీవీల్లో వీక్షించారు.
దీంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో 22.5 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. మార్చి 13న వరల్డ్‌వైడ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఈ సినిమాను స్టార్ మా ఛానల్‌లో టెలికాస్ట్ చేశారు. దీంతో ఈ సినిమా తెలుగులో ఆల్‌టైం టాప్ 5 టీఆర్పీ రేటింగ్స్‌లో స్థానం దక్కించుకుంది. ఇక టాప్ 1 ప్లేస్‌లో బన్నీ నటించిన ‘అల వైకుంఠపురములో’ ఇంకా తన రికార్డును పదిలంగా కాపాడుకుంది.
Pushpa2: బన్నీ రెమ్యునరేషన్.. భారీగానే సమర్పయామి?
పుష్ప చిత్రాన్ని పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ కాగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెత్‌తో ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప – ది రూల్’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సుకుమార్ అండ్ టీమ్ రెడీ అవుతోంది.