Akkineni Amala : మళ్ళీ సినిమాల్లోకి అమల.. ఒకేసారి తమిళ్, తెలుగులో రీఎంట్రీ

30 సంవత్సరాల తర్వాత అక్కినేని అమల కూడా వెండితెరపై కనిపించబోతుంది.

Akkineni Amala : మళ్ళీ సినిమాల్లోకి అమల.. ఒకేసారి తమిళ్, తెలుగులో రీఎంట్రీ

Amala Akkineni

Updated On : September 27, 2021 / 3:32 PM IST

Akkineni Amala:  ఇటీవల చాలా మంది సీనియర్ హీరోయిన్లు వెండితెర పైకి రీఎంట్రీ ఇస్తున్నారు. అక్క, తల్లి పాత్రల్లోనే కాకుండా ఏదైనా స్పెషల్ పాత్రల్లో లేదా గెస్ట్ పాత్రలతో సినిమాల్లోకి మళ్ళీ వస్తున్నారు. సరసాలు చాలు శ్రీవారు.. అంటూ నాగార్జునతో శివ సినిమాలో అదరగొట్టిన అమల తర్వాత మన టాలీవుడ్ కింగ్ నాగార్జునని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపొయింది. ఆ తర్వాత సినిమాలు చేయలేదు. తాజాగా 30 సంవత్సరాల తర్వాత అక్కినేని అమల కూడా వెండితెరపై కనిపించబోతుంది. ఈ మధ్యలో చాలా మంది అమలని గెస్ట్ పాత్రల కోసం, స్పెషల్ పాత్రల కోసం సంప్రదించినా చేయలేదు.

కానీ తాజాగా అమల ఓ సినిమాకి ఓకే చెప్పింది. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయింది. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో శర్వానంద్ హీరోగా, రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తున్న ”కణం” సినిమాలో అమల ఒక ముఖ్యపాత్రలో నటిస్తుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ్ లో ఒకేసారి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అమల మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది. డైరెక్టర్ శ్రీ కార్తిక్ చెప్పిన కథ బాగా నచ్చడంతో తాను రీఎంట్రీ కి ఒప్పుకున్నాను అని తెలిపింది.

Bollywood Films : ‘పుష్ప’ తో సహా రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్న పది సినిమాలు..

ఇవాళ షూటింగ్ లొకేషన్ లోని తన వర్కింగ్ స్టిల్ ని సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ అభిమానులకి షేర్ చేసింది. అలాగే ఈ సినిమా శర్వానంద్ కి డైరెక్ట్ గా తమిళ్ లో మూడవ సినిమా కావడం విశేషం. చాలా రోజుల తర్వాత మళ్ళీ శర్వానంద్ ఒకేసారి తమిళ్, తెలుగులో సినిమా చేస్తున్నాడు. అమల కూడా తన రీఎంట్రీని తమిళ్,తెలుగులో ఒకేసారి ప్లాన్ చేసుకుంది ఈ సినిమాతో..