Ambati rambabu: నన్ను ఆంబోతు అని తిడుతున్నారు: మంత్రి అంబ‌టి  

కాఫ‌ర్ డ్యామ్ పూర్తి చేయ‌కుండా డ‌యాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తారా? అని ఆయ‌న నిల‌దీశారు. ఈ విష‌యాన్ని అడిగితే త‌న‌ను ఆంబోతు అని తిడుతున్నారని అంబ‌టి రాంబాబు అన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ ఆలోచించి మాట్లాడితే బాగుంటుంద‌ని ఆయ‌న సూచించారు. ఆయన అహం భావాన్ని తగ్గించుకోవాలని అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేయవద్దని ఆయన సూచించారు.

Ambati rambabu: నన్ను ఆంబోతు అని తిడుతున్నారు: మంత్రి అంబ‌టి  

Bitter Experience To Ysrcp Leader Ambati Rambabu From Gadapa Gadapaku Program

Updated On : July 18, 2022 / 12:49 PM IST

Ambati rambabu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుతో పాటు టీడీపీ నేత‌ల‌పై ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు. ఇవాళ ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో పోల‌వ‌రాన్ని ఎందుకు పూర్తిచేయ‌లేద‌ని నిల‌దీశారు. టీడీపీ పాల‌న న‌చ్చ‌కే ఆ పార్టీని, దేవినేని ఉమ‌ను ప్ర‌జ‌లు పీకి పారేశారని ఆయ‌న వ్యాఖ్యానించారు. డ‌యాఫ్రమ్ వాల్ దెబ్బ‌తిన‌డానికి టీడీపీ త‌ప్పిద‌మే కార‌ణమ‌ని ఆయ‌న చెప్పారు. 2018లోపు పోల‌వ‌రాన్ని పూర్తి చేస్తామ‌న్న మీరు చేతకాని వారా? ప‌నులు పూర్తిచేస్తున్నా తాము చేత‌కాని వాళ్ళ‌మా? అని అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు.

England vs India: రిష‌బ్ పంత్ అద్భుత ఆట‌తీరుపై స‌చిన్, గంగూలీ, సెహ్వాగ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు