అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు

అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు

Updated On : March 1, 2021 / 1:16 PM IST

amit shah tirupati tour cancel: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దైంది. మార్చి 4, 5 తేదీల్లో అమిత్ షా తిరుపతిలో పర్యటించాల్సి ఉంది. 4వ తేదీన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండళ్ల సమావేశంలో పాల్గొనాలని షా భావించారు. 5న బీజేపీ, జనసేన సమావేశంలోనూ పాల్గొనాల్సింది. అయితే, పలు కారణాలతో ఈ రెండు కార్యక్రమాలను అమిత్ షా రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ కు మూడు రోజుల ముందు పర్యటనను రద్దు చేసుకున్నారు అమిత్ షా.

టూర్ రద్దుకి సంబంధించి ఏపీ బీజేపీ నేతలకు సమాచారం అందింది. అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు అయిన నేపథ్యంలో తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు సంబంధించి బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రకటన కూడా వాయిదా పడింది.

4, 5 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమినాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల సీఎంలకు సమాచారం అందించారు. అకస్మాత్తుగా అమిత్‌షా తిరుపతి పర్యటన రద్దు అయ్యింది.