Prabhas: ప్రభాస్‌కు తండ్రిగా ఆ స్టార్ యాక్టర్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల ‘రాధేశ్యామ్’ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ రావడంతో దాని ప్రభావం కలెక్షన్లపై పడింది....

Prabhas: ప్రభాస్‌కు తండ్రిగా ఆ స్టార్ యాక్టర్..?

Amitabh Bachchan To Play Prabhas Father Role In Project K

Updated On : March 23, 2022 / 8:57 PM IST

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల ‘రాధేశ్యామ్’ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ రావడంతో దాని ప్రభావం కలెక్షన్లపై పడింది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే ఈ జాబితాలో ఆదిపురుష్, సలార్ చిత్రాలతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రాజెక్ట్ K అనే సినిమా కూడా ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించేందుకు రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాకు ప్రాజెక్ట్ K అనే వర్కింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.

Project K: హెల్ప్ ప్లీజ్ అంటూ హైప్ పెంచిన అశ్విన్.. అసలేంటి ప్రాజెక్ట్ కె?

ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు తండ్రి పాత్రలో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ K చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. కాగా తాజాగా ఈ సినిమాలో ఆయన ప్రభాస్‌కు తండ్రి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తండ్రిగా అమితాబ్ బచ్చన్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారనే ఆయన్ను ఈ సినిమా కోసం తీసుకున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర సరికొత్తగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ పరంగా కూడా అందరినీ మెస్మరైజ్ చేయనున్నాడట.

Project K : ప్రభాస్ సినిమా కోసం రంగంలోకి ఆనంద్ మహేంద్ర.. నాగ్ అశ్విన్ ట్వీట్‌కి రిప్లై

దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను పూర్తిగా సైన్స్-ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను అశ్విని దత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.