Anasuya : పొట్టి గౌనులో అనసూయ ఫోటోషూట్.. కరోనా టైంలో మాకేంటిది అంటూ నెటిజన్ల కామెంట్స్.. యాంకరమ్మ ఏమందంటే…

యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ సోషల్ మీడియాలో తనను చిరాకు పెట్టే కామెంట్స్ చేసే వారికి చురకలంటించడం కొత్తేం కాదు.. గతంలో ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి..

Anasuya : పొట్టి గౌనులో అనసూయ ఫోటోషూట్.. కరోనా టైంలో మాకేంటిది అంటూ నెటిజన్ల కామెంట్స్.. యాంకరమ్మ ఏమందంటే…

Anasuya

Updated On : April 24, 2021 / 5:46 PM IST

Anasuya: స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ సోషల్ మీడియాలో తనను చిరాకు పెట్టే కామెంట్స్ చేసే వారికి చురకలంటించడం కొత్తేం కాదు.. గతంలో ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి.. తాజాగా ఓ నెటిజన్‌కు తన స్టైల్లో అదిరిపోయే రిప్లై ఇచ్చి నెట్టింట మరోసారి వార్తల్లో నిలిచారు అనసూయ..

Anasuya

రీసెంట్‌గా ఓ ఫొటోషూట్ కోసం గౌను వేసుకున్నారు అనసూయ.. ఆ పిక్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా కొందరు నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేశారు.. ఆ ఫొటోస్ చూసి ఓ నెటిజన్.. ‘ఓ పక్క దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.. చాలా మంది చనిపోతున్నారు.. దాని గురించి మీకస్సలు బాధ అనిపించడం లేదా?.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇటువంటి పిక్స్ అవసరమా.. అనేది నా ఉద్దేశం’.. అంటూ కామెంట్ చేశాడు..

Thank you Brother  

దీనికి అనసూయ ‘ఇలాంటి కఠిన సమయాల్లో కూడా ఆడియెన్స్‌కి కొంత వరకు ఎంటర్‌టైన్‌మెంట్‌ని, నమ్మకాన్ని ఇస్తున్నాం.. నువ్వు పాజిటివ్ కోణంలో ఎందుకు ఆలోచించలేవా?’.. అంటూ రిప్లై ఇచ్చారు.. బుల్లితెర ప్రోగ్రామ్స్‌తో బిజీగా ఉండే అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ‘థ్యాంక్ యు బ్రదర్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది.. అల్లు అర్జున్ ‘పుష్ప’, రవితేజ ‘ఖిలాడి’ సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు..

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)