Eanugu Ravinder Reddy : బీజేపీకి మరో షాక్..! పార్టీని వీడనున్న ఏనుగు రవీందర్‌ రెడ్డి? ఆ పదవి దక్కకపోవడంతో..

Eanugu Ravinder Reddy : ఆ పదవి దక్కకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని, తన దారి తను చూసుకునే పనిలో ఉన్నట్లుగా సమాచారం వస్తోంది.

Eanugu Ravinder Reddy : బీజేపీకి మరో షాక్..! పార్టీని వీడనున్న ఏనుగు రవీందర్‌ రెడ్డి? ఆ పదవి దక్కకపోవడంతో..

Eanugu Ravinder Reddy

Updated On : July 6, 2023 / 5:04 PM IST

Eanugu Ravinder Reddy – BJP : తెలంగాణ బీజేపీకి మరొక షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. కమలం పార్టీని వీడేందుకు ఏనుగు రవీందర్ రెడ్డి గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఆయన త్వరలో కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరినప్పుడు ఆయనతో పాటు బీజేపీలోకి వచ్చారు.

Also Read..Eatala Rajender : నాకు పదవి ఇవ్వడానికి ప్రధాన కారణం అదే- ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

ఎల్లారెడ్డిలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డి ఈటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని బలంగా కోరుకున్నారు. కానీ, ఈటలకు ఆ పదవి దక్కకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని, తన దారి తను చూసుకునే పనిలో ఉన్నట్లుగా సమాచారం వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ గెలవదనే ఆలోచనలో ఏనుగు రవీందర్ రెడ్డి ఉన్నారట. ఎల్లారెడ్డిలో సైతం బీజేపీ అంత అంత మాత్రంగా ఉందన్న భావనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఏనుగు రవీందర్ కాంగ్రెస్ గూటికి వెళ్లే యోచన చేస్తున్నట్లుగా సమాచారం. ఇది బీజేపీకి ఒక షాక్ అని చెప్పొచ్చు.

కొంతకాలంగా ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీతోనూ అంటీముట్టనట్లు ఉన్నారు. బీఆర్ఎస్ ను వీడి ఈటల రాజేందర్ తో కలిసి బీజేపీలోకి వచ్చారు రవీందర్ రెడ్డి. ఈటల రాజేందర్ అధ్యక్షుడు కావాలని ఏనుగు రవీందర్ రెడ్డి జాతీయ నాయకత్వాన్ని బలంగా డిమాండ్ కూడా చేశారు. కానీ, బీజేపీ హైకమాండ్ అధ్యక్ష బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించింది. ఈటలకు ప్రచార కమిటీ బాధ్యతలు ఇచ్చింది. అయినా ఇప్పటివరకు ఏనుగు రవీందర్ రెడ్డి ఈటలను కలవలేదు, శుభాక్షాంక్షలు తెలుపలేదు.

Also Read..Komatireddy Raj Gopal Reddy : జాక్ పాట్ కొట్టిన కోమటిరెడ్డి.. ఎట్టకేలకు కీలక పదవి

మరోవైపు ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే జూపల్లి కృష్ణారావుని ఆయన కలిసినట్లు తెలుస్తోంది. తాను కాంగ్రెస్ లోకి వస్తే తనకు ఇచ్చే ప్రాధాన్యత? కాంగ్రెస్ లోకి రావడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? అనేదానిపై ఏనుగు రవీందర్ రెడ్డి జూపల్లితో డిస్కస్ చేసినట్లు సమాచారం. ఇక కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనే అభిప్రాయంతో ఏనుగు రవీందర్ రెడ్డి తన దారి తాను చూసుకునే పనిలో పడ్డారని సమాచారం. కాగా, కార్యకర్తలతో చర్చించి, వారి అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని ఏనుగు రవీందర్ రెడ్డి అంటున్నారు. దాదాపుగా బీజేపీని వీడేందుకు ఖాయమైందని తెలుస్తోంది.