Roja daughter: ఎమ్మెల్యే రోజా కుమార్తెకు “యంగ్ సూపర్‌స్టార్” అవార్డు

సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా వారసురాలు అన్షు మాలిక కూడా తల్లికి తగ్గ తనయగా నిరూపించుకుంటున్నారు.

Roja daughter: ఎమ్మెల్యే రోజా కుమార్తెకు “యంగ్ సూపర్‌స్టార్” అవార్డు

Anshu Malika

Updated On : October 2, 2021 / 8:47 PM IST

Roja daughter: సినీ, రాజకీయ రంగాల్లో తనదైన పాత్రను పోషిస్తూ విజయపథంలో ముందుకు సాగుతున్న సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా వారసురాలు అన్షు మాలిక కూడా తల్లికి తగ్గ తనయగా నిరూపించుకుంటున్నారు. రైటర్‌, ప్రోగ్రామర్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌గా సత్తా చాటుతున్నారు రోజా కూతురు అన్షు మాలిక.

సమాజంలో ఓ లక్ష్యంతో పనిచేస్తున్న యువతకు ఇచ్చే “యంగ్ సూపర్‌స్టార్” అవార్డు ఆమెకు దక్కింది. ఇన్‌ప్లూయెన్సర్‌ యూకే మేగజైన్‌ ఆమెకు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు అన్షు మాలిక ఫోటోను కవర్ ఫోటోగా ప్రచురించింది. ఇటువంటి అవార్టు అందుకోవడంపై ఇన్‌స్టాగ్రమ్ వేదికగా అన్షు మాలిక తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Anshu (@anshumalikarojaselvamanioffcl)

నిజంగా ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని, “యంగ్ సూపర్‌స్టార్” అవార్డు రావడాన్ని నమ్మలేకపోతున్నట్లు చెప్పుకొచ్చారు. కలలు సాకారం చేసుకుంటున్నట్లుగా రాసుకొచ్చారు. ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై సైతం క్వీన్ ఆఫ్ టాలెంట్‌గా అన్షు మాలిక ఫొటో వేయడం గమనార్హం. రోజా, సెల్వమణికి ఓ కూతురు అన్షు మాలిక, కుమారుడు కృష్ణ లోహిత్ ఉన్నారు.