Ashwini Dutt: స్టూడెంట్ నెంబర్ 1 హీరో ఎన్టీఆర్ కాదట!

టాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘సీతా రామం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఆయన ‘ఆలీతో సరదాగా’ అనే టాక్ షోలో పాల్గొని, సీతా రామం చిత్రంతో పాటు పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఆడియెన్స్‌తో పంచుకున్నాడు.

Ashwini Dutt: స్టూడెంట్ నెంబర్ 1 హీరో ఎన్టీఆర్ కాదట!

Ashwini Dutt Reveals Interesting Fact About Student No 1 Movie

Updated On : August 12, 2022 / 11:26 AM IST

Ashwini Dutt: టాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘సీతా రామం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తనదైన మార్క్ క్లాస్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఆయన ‘ఆలీతో సరదాగా’ అనే టాక్ షోలో పాల్గొని, సీతా రామం చిత్రంతో పాటు పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఆడియెన్స్‌తో పంచుకున్నాడు.

Ashwini Dutt : ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోవడానికి పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కూడా కారణమే..

గతంలో దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తొలి సినిమా ‘స్టూడెంట్ నెం 1’ను స్వప్న సినిమా బ్యానర్‌పై రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరో కోసం చిత్ర యూనిట్ వెతుకుతుండగా, ప్రభాస్‌ను తీసుకోవాలని రాజమౌళి అనుకున్నాడట. కానీ, నందమూరి హరికృష్ణ తమకు ఫోన్ చేసి, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌ను హీరోగా తీసుకోవాలని కోరారట. ఆయన కోరినట్లుగానే తాము జూనియర్ ఎన్టీఆర్‌ను ఈ సినిమా కోసం తీసుకున్నామని.. అయితే తాము అనుకున్న దానికంటూ కూడా తారక్ రెచ్చిపోయి పర్ఫార్మ్ చేశాడని.. అందుకే ఆ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందని అశ్వినీ దత్ తెలిపారు.

Ashwini Dutt : ముందు అలా.. తర్వాత ఇలా.. నిర్మాతల నిర్ణయమే నా నిర్ణయం..

మొత్తానికి ఎన్టీఆర్‌కు తొలి సూపర్ హిట్‌ను అందించిన మూవీలో అసలు ఆయన హీరోనే కాదనే విషయాన్ని తెలుసుకుని అభిమానులు అవాక్కవుతున్నారు. ఏదేమైనా ఏ సినిమా ఎవరు చేయాలో మన చేతుల్లో ఏం ఉంటుందని వారు అంటున్నారు. ఇక సీతా రామం సినిమా కూడా తాము ఊహించిన దానికంటే డబుల్ రేంజ్ సక్సెస్ అందుకోవడం చాలా హ్యాపీగా ఉందని, మున్ముందు కూడా ఇలాంటి మంచి క్లాసిక్ కథలను తెరకెక్కిస్తామని అశ్వినీ దత్ ఈ సందర్భంగా తెలిపారు.