Ashwini Dutt : ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోవడానికి పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కూడా కారణమే..

అశ్వినీదత్ మాట్లాడుతూ.. ''ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోవడానికి కరోనా ఒక కారణం మాత్రమే. అలాగే టికెట్ రేట్లు ఇష్టమొచ్చినట్టు పెంచడం, మళ్ళీ తగ్గించడం, మళ్ళీ పెంచడం........

Ashwini Dutt : ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోవడానికి పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కూడా కారణమే..

Popcorn

Ashwini Dutt :  ప్రస్తుతం టాలీవుడ్ సమస్యల వలయంలో ఉన్న సంగతి తెలిసిందే. థియేటర్ కి జనాలు రాకపోవడం, టికెట్ రేట్లు, పరిశ్రమ సమస్యలు, ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్.. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సమస్యల పరిష్కారానికి సినీ పెద్దలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లో నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్ గిల్డ్, ఫిలిం ఛాంబర్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. దీంతో సమస్యలకి పరిష్కారం దొరకగా పోగా కొత్త సమస్యలు వస్తున్నాయి.

Prabhas : ప్రాజెక్ట్ K సినిమా ఎవెంజర్స్ రేంజ్‌లో ఉంటుంది.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అశ్వినీదత్..

తాజాగా సీనియర్ నిర్మాత అశ్వినీదత్ టాలీవుడ్ సమస్యలపై మీడియాతో మాట్లాడారు. ప్రొడ్యూసర్ గిల్డ్ ఎందుకు ఉందో తెలీదు, హీరోలు కరెక్ట్ గానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, మొన్న టికెట్లు పెంచమన్న వాళ్ళే ఇప్పుడు టికెట్లు తగ్గించమంటున్నారు అని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రేక్షకులు థియేటర్ కి ఎందుకు రావట్లేదు అని పలు కారణాలు తెలిపారు. అశ్వినీదత్ మాట్లాడుతూ.. ”ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోవడానికి కరోనా ఒక కారణం మాత్రమే. అలాగే టికెట్ రేట్లు ఇష్టమొచ్చినట్టు పెంచడం, మళ్ళీ తగ్గించడం, మళ్ళీ పెంచడం కూడా ఒక కారణం. చాలా మంది థియేటర్లలో స్నాక్స్, కూల్ డ్రింక్స్, పాప్‌కార్న్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి జనాలు, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే భయపడేలా చేస్తున్నారు. ఇదే సమయంలో ఓటీటీలు కూడా వచ్చాయి. ఇలా జనాలు థియేటర్ కి రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి” అని తెలిపారు.