Meritorious Students : అసోంలో మెరిట్ విద్యార్థులకు స్కూటర్లు… సీఎం ప్రకటన

Meritorious Students : అసోంలో మెరిట్ విద్యార్థులకు స్కూటర్లు… సీఎం ప్రకటన

scooters to Meritorious Students

scooters to Meritorious Students : అసోం రాష్ట్ర ప్రభుత్వం మెరిట్ విద్యార్థులకు ఉచితంగా స్కూటర్లు ఇవ్వాలని నిర్ణయించింది. హయ్యర్ సెకండరీ పరీక్షల్లో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా స్కూటర్లు ఇవ్వనున్నట్లు అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వాశర్మ వెల్లడించారు. ( scooters to Meritorious Students) అసోంలో 9వతరగతి చదువుతున్న విద్యార్థులు 3.78 లక్షల మందికి సైకిళ్లు అందజేస్తామని సీఎం ప్రకటిచారు. సీఎం హిమంత బిశ్వా శర్మ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Small Plane Crash : ఫ్రాన్సులో చిన్న విమానం కూలి ఇద్దరి మృతి

12 తరగతి పరీక్షల్లో 60 శాతం మార్కులు వచ్చిన బాలికలకు, 75 శాతం మార్కులు వచ్చిన బాలురకు ఉచితంగా స్కూటర్లు పంపిణీ చేస్తామని అసోం పర్యాటక శాఖ మంత్రి జయంత్ మల్లా బరుహ్ చెప్పారు. (passed Class 12 exams) దీనికోసం కేబినెట్ రూ.167 కోట్లను కేటాయించిందని మంత్రి పేర్కొన్నారు. (Assam Govt to provide) దీంతో పాటు 7 లక్షలమందికి నెలకు 1250 రూపాయల చొప్పున సెప్టెంబర్ నుంచి ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

Mexico Bus Accident : మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం, 27 మంది మృతి

అసోం రాష్ట్రంలో జాతీయ క్రీడలు నిర్వహించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ ను కోరామన్నారు. అసోం రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఓబీసీలకు 27 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించామని మంత్రి వివరించారు. అసోంలో చిన్న తరహా, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం హిమంత బిశ్వాశర్మ చెప్పారు.