Prateek Doshi : నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ దోషి ఎవరు?

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వంగమయి వివాహం ఇటీవల ప్రతీక్ దోషితో సింపుల్ గా జరిగింది. అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ దోషి బ్యాగ్రౌండ్‌పై జనం ఆరా తీస్తున్నారు.

Prateek Doshi : నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ దోషి ఎవరు?

Prateek Doshi Background

Updated On : June 10, 2023 / 3:22 PM IST

Prateek Doshi Background : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వంగమయి వివాహం ప్రతీక్ దోషితో ఇటీవలే జరిగింది. వీరి వివాహం ఎటువంటి అట్టహాసం లేకుండా సింపుల్‌గా జరిగింది. అయితే నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ దోషి ఎవరు, అతని బ్యాగ్రౌండ్ ఏంటనే చర్చ జరుగుతోంది.

Nirmala Sitharaman: బెంగళూరులో నిరాడంబరంగా నిర్మలాసీతారామన్ కుమార్తె వివాహం

నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వంగమయి, ప్రతీక్ దోషి వివాహం బెంగళూరులో జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన ఓ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెళ్లి వార్త బయటకు వచ్చింది. వీరి వివాహం చాలా కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రతీక్ దోషి గుజరాత్‌కి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. PMO అధికారిగా ఉన్న అతడు ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు.

ప్రతీక్ దోషి PMO లో జాయింట్ సెక్రటరీ హోదాలో స్పెషల్ డ్యూటీ ఆఫీసర్‌గా ఉన్నారు. కేవలం వ్యూహాలు, పరిశోధనలకే పరిమితం కాకుండా ప్రధానమంత్రికి కార్యదర్శిగా కూడా సహాయం అందిస్తారు. జూలై 2019 నుంచి ఈ హోదాలో పనిచేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ నాటికి PMO అధికారులు, సిబ్బందిలో దోషి లెవెల్ 14 పే బ్యాండ్‌లో ఉన్నారు. PMO వెబ్ సైట్ ప్రకారం అతని నెలసరి వేతనం రూ.1,57,000 గా తెలుస్తోంది.

Prime Minister’s Office: ప్రధాని ఆఫీస్‌లో ఎంతమంది పనిచేస్తారు..? PMO సమాధానం!

ప్రతీక్ సింగపూర్‌ మేనేజ్మెంట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్.. ఇక  పరకాల వంగమయి మల్టీ మీడియా జర్నలిస్టు. ఆమె ప్రస్తుతం మింట్ లాంజ్‌లో ఫీచర్ రైటర్‌గా ఉన్నారు. గతంలో హిందూ దినపత్రికలో పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలోని మెడిల్ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. వంగమయి రాసిన అనేక రచనలు ప్రచురించబడ్డాయి.