Bihar political crisis : మహారాష్ట్ర తరహాలో బీహార్‌లోనూ రాజకీయ సంక్షోభం?

మహారాష్ట్ర తరహాలో బీహార్‌ రాష్ట్రంలోనూ రాజకీయ సంక్షోభం ఏర్పడుతోందా ? అంటే అవునంటున్నాయి బీజేపీ వర్గాలు. మహారాష్ట్ర తరహాలో బిహార్‌లో బీజేపీ ఆపరేషన్ జనతాదళ్ (యునైటెడ్)లో చీలిక దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం ...

Bihar political crisis : మహారాష్ట్ర తరహాలో బీహార్‌లోనూ రాజకీయ సంక్షోభం?

Bihar political crisis

Updated On : July 3, 2023 / 11:51 AM IST

Bihar political crisis : మహారాష్ట్ర తరహాలో బీహార్‌ రాష్ట్రంలోనూ రాజకీయ సంక్షోభం ఏర్పడుతోందా ? అంటే అవునంటున్నాయి బీజేపీ వర్గాలు. మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) పార్టీ నాయకుడు అజిత్ పవార్ రెబెల్ ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు బావుటా ఎగురవేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మహారాష్ట్ర తరహాలో బిహార్‌లో బీజేపీ ఆపరేషన్ జనతాదళ్ (యునైటెడ్)లో చీలిక దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

NCP chief Sharad Pawar : మేనల్లుడి తిరుగుబాటుపై శరద్ పవార్ ఏమన్నారంటే …

తమతో పలువురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని సాక్షాత్తూ బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ సింగ్ వెల్లడించారు. జేడీ(యూ)తో పాటు పలువురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని అరవింద్ సింగ్ చెప్పారు. (Maharashtra like political crisis) దీంతో నితీష్ కుమార్ తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారితో వేర్వేరుగా సమావేశం అవుతున్నారు. తన శాసనసభ్యులతో ఈ వ్యక్తిగత సమావేశాలు నిర్వహించడం వెనుక నితీష్ కుమార్ తన పార్టీలో చీలికకు భయపడుతున్నట్లు ఊహాగానాలు ఏర్పడ్డాయి.

Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం.. అజిత్ పవార్ తిరుగుబాటు

నితీష్ కుమార్ గత ఏడాది ఆగస్టులో బీజేపీతో పొత్తును విరమించుకుని మహాకూటమితో చేతులు కలిపారు. నితీష్ కుమార్ బీజేపీతో విడిపోయినప్పటి నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత పది నెలల్లో ఐదుసార్లు బీహార్‌లో పర్యటించారు. ప్రతి సందర్భంలోనూ తన ప్రసంగాల్లో నితీష్ కుమార్‌ను ఘాటుగా విమర్శిస్తూ, బీజేపీ తలుపులు ఆయనకు శాశ్వతంగా మూసుకుపోయాయని ప్రకటించారు.