ED Rides in TRS Leaders : ఈడీ రాడార్ లో టీఆర్ఎస్ నేతలు..త్వరలోనే రైడ్స్ జరుగుతాయి : ఎమ్మెల్యే రాజాసింగ్

తెలంగాణలో ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ జరుగుతాయి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనేకమంది టీఆర్ఎస్ నేతలు ఈడీ రాడార్ లో ఉన్నారని..త్వరలోనే వారిపై ఈడీ రైడ్స్ జరుగుతాయి అని వ్యాఖ్యానించారు.

ED Rides in TRS Leaders : ఈడీ రాడార్ లో టీఆర్ఎస్ నేతలు..త్వరలోనే రైడ్స్ జరుగుతాయి : ఎమ్మెల్యే రాజాసింగ్

 ED raids will be conducted on TRS leaders say Rajasingh

Updated On : August 10, 2022 / 5:13 PM IST

ED Rides in Telangana TRS Leaders say MLA Raja singh : తెలంగాణలో ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రైడ్స్ జరుగుతాయి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనేకమంది టీఆర్ఎస్ నేతలు ఈడీ రాడార్ లో ఉన్నారని..త్వరలోనే వారిపై ఈడీ రైడ్స్ జరుగుతాయి అని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ లో ఓ మంత్రి ఇంట్లో ఈడీ రైడ్ చేయగా కోట్ల కొద్దీ రూపాయలు బయటపడ్డాయని..తెలంగాణలో ఈడీ రైడ్స్ జరిగితే కూడా అదే జరుగుతుందని అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా.. బీజేపీ తనను ప్రశ్నించే విపక్ష నేతలపై ఈడీ దాడులు చేయిస్తోంది అనే ఆరోపణలు ఉన్న క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే మాట అన్నారు. కొన్ని వారాల క్రితం కేసీఆర్ మాట్లాడుతూ..బీజేపీ ఖ‌చ్చితంగా టీఅర్ఎస్ పార్టీని, నేత‌ల‌ను టార్గెట్ చేస్తుందని ఈడీ దాడులు చేయిస్తుంది అని అన్నారు.

ఇత‌ర రాష్ట్రాల్లో బీజేపీ నేత‌లు అనుస‌రించిన స్ట్రాట‌జీ, ప్రతిప‌క్షాల‌పై ఎక్కుపెట్టిన అస్త్రాలు ఇలా అన్నింటిని ప‌సిగ‌ట్టిన టీఅర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంట్లో భాగంగానే అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల‌ను రంగంలోకి దించి..ఈడీ, ఇన్‌కంటాక్స్‌, సీబీఐ వంటి సంస్థలతో ఏ సమయంలోనైనా ద‌ర్యాప్తులు ఉంటాయ‌ని బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు కేసిఅర్‌.

గతంలో అనేక రాష్ట్రాల్లో ఇలాగే జ‌రిగింద‌ని మెన్నటికీ మెన్న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పంజాబ్‌, ఉత్తర‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఈడీ దాడులు జ‌రిగాయని గుర్తు చేశారు. అదే విధంగా మ‌న‌ రాష్ట్రంలోనూ ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలపై కూడా ఈడీ దాడులు చేయవచ్చని టీఅర్ఎస్ నేత‌లు అంచ‌నా వేశారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణలో టీఆర్ఎస్ నేతలపై ఈడీ రైడ్స్ జరుగుతాయని వ్యాఖ్యానించటం కేసీఆర్ ముందస్తు అంచనాలకు సరిగ్గా సరిపోయినట్లుగా ఉన్నాయి.