BJP MP Arvind Vs MLC Kavitha : నా వ్యాఖ్యలు నిజం కాబట్టే కవిత అంతలా రియాక్ట్ అయ్యారు : బీజేపీ ఎంపీ అర్వింద్
బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్..టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు కొనసాగుతున్నాయి. కవిత కాంగ్రెస్ లో చేరటానికి మంతనాలు జరుపుుతున్నారని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన కవిత అర్వింద్ ను చెప్పుతో కొడతాను అని అంటే నా వ్యాఖ్యలు కేవటం ఆరోపణలు మాత్రమే అయితే కవిత అంత తీవ్రంగా ఎందుకు రియాక్ట్ అయ్యారు..ఆమె అంతగా రియాక్ట్ అయ్యారంటే నా మాటలు నిజమేనంటూ ఎదురు కౌంటర్ వేశారు అర్వింద్.

BJP MP Arvind Fire on TRS MLC Kavitha
BJP MP Arvind Vs MLC Kavitha : బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్..టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు కొనసాగుతున్నాయి. ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని పెంచింది. తన ఇంటిపై దాడి ఘటనపై ఎంపీ అర్వింద్ తీవ్రంగా మండిపడ్డారు. నా ఇంటిపై దాడి చేయటమే కాకుండా నా తల్లిని బెదిరించారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా తల్లిని బెదరించే హక్కు ఈ టీఆర్ఎస్ గూండాలకు ఎక్కడిది అంటూ ప్రశ్నించారు.
కవితకు కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ప్లాన్ చేస్తున్నారని..దాని కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఫోన్ లో మాట్లాడారు అంటూ అర్వింద్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కవిత తీవ్రంగా స్పందించారు. నా గురించి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఎంపీ అర్వింద్ ను చెప్పుతో కొడతాను అంటూ మండిపడ్డారు. దీంతో అర్వింద్ కూడా కవితకు ధీటుగా సమాధానం ఇచ్చారు. నా వ్యాఖ్యలు కేవలం ఆరోపణలు అయితే కవిత అంతగా రియాక్ట్ అవ్వరు అని నిజం కాబట్టి అంత తీవ్రంగా రియాక్ట్ అయ్యారని అన్నారు.
ఖర్గేతో కవిత టచ్ లోనే ఉన్నారని..ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత మెడకు చుట్టుకోవటంపై తండ్రి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదనే కోపంతో కాంగ్రెస్ లో చేరటానికి కవిత సిద్ధమయ్యారని అందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో మంతనాలు జరుపుతున్నారు అంటూ మరోసారి వ్యాఖ్యానించారు. ఇలా ఇద్దరి మధ్యా మాటల తూటాలు పేలటం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.
ఎంపీ అర్వింద్ మాత్రం ఏమాత్రం తగ్గటంలేదు. ట్విట్టర్ ద్వారా కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే హైదరాబాద్ లోని తన ఇంటిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారంటూ ఆరోపించారు. మా ఇంటిపై దాడి చేసిన ఇంట్లోకి చొరబడి ఇంట్లోని వస్తువులను పగులగొట్టారని..నా తల్లిని బెదరించారరని ఆరోపించారు. ఇంట్లో దాడికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ ట్వీట్ ను ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాని కార్యాలయానికి ట్యాగ్ చేశారు. దాడికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.
కెసిఆర్, KTR, K.కవిత ల ఆదేశాలపై హైదరాబాద్ లోని నా ఇంటిపై దాడి చేసిన TRS గుండాలు.
ఇంట్లో వస్తువులు పగలగొడుతూ, బీభత్సం సృష్టిస్తూ, మా అమ్మను బెదిరించారు!
TRS goons attacked my residence and vandalised the house.
They terrorised my mother & created ruckus.@PMOIndia @narendramodi pic.twitter.com/LwtzZU4rfg
— Arvind Dharmapuri (@Arvindharmapuri) November 18, 2022