జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం

  • Published By: bheemraj ,Published On : December 4, 2020 / 11:15 AM IST
జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం

Updated On : December 4, 2020 / 11:24 AM IST

BJP objected votes counting : జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. బూత్ నెంబర్ 8లో 471 ఓట్లు పోల్ అయ్యాయి. కానీ బ్యాలెట్ బాక్సులో 257 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఓట్లు గల్లంతు కావడం పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే పోలింగ్ శాతం తప్పుగా చెప్పామని అధికారులు అంటున్నారు.



మరోవైపు జీహెచ్ఎంసీ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 78 డివిజన్లలో బీజేపీ ఆధిక్యం కనబరిచింది. టీఆర్ఎస్ వెనుకంజలో ఉంది. టీఆర్ఎస్ 33, ఎంఐఎం 15, కాంగ్రెస్ 1 స్థానంలో ఉన్నాయి. కౌంటింగ్ కొనసాగుతోంది.