BJP MP Hardwar Dubey : బీజేపీ ఎంపీ హరద్వార్ దూబే కన్నుమూత

బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ హరద్వార్ దూబే సోమవారం ఢిల్లీలోని ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగర వాసి అయిన దూబే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు....

BJP MP Hardwar Dubey : బీజేపీ ఎంపీ హరద్వార్ దూబే కన్నుమూత

BJP MP Hardwar Dubey

Updated On : June 26, 2023 / 11:20 AM IST

BJP’s Rajya Sabha MP Hardwar Dubey : బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ హరద్వార్ దూబే సోమవారం ఢిల్లీలోని ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగర వాసి అయిన దూబే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. (MP Hardwar Dubey passes away) గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దూబే పలు పదవులు నిర్వర్తించారు.

Odisha Bus Accident : ఒడిశాలో రెండు బస్సులు ఢీ, 10 మంది మృతి, 8మందికి గాయాలు

గతంలో దూబే ఆగ్రా రాజకీయాల్లో చురుకుగా పనిచేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. దూబే మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ‘‘భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ హర్‌ద్వార్ దూబే మరణ వార్త కలిచివేసింది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని మీరట్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ ట్వీట్ చేశారు.

US Coast Guard Investigates : టైటానిక్ జలాంతర్గామి పేలుడుకు కారణాలపై యూఎస్ కోస్ట్‌గార్డ్ పరిశోధన

‘రాజ్యసభ సభ్యుడు దూబే మరణించారనే వార్త బాధాకరం. ఇది బీజేపీ కుటుంబానికి తీరని లోటు. ఈ బాధను భరించే ధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’’ ఫతేపూర్ సిక్రి ఎంపీ రాకుమార్ చాహద్ ట్వీట్ చేశారు.