Real Hero : తుపాను గాలికి తల్లి దుకాణం పడిపోకుండా కాపాడిన బాలుడు.. నిజంగా రియల్ హీరో

నాలుగేళ్ల బాలుడు అంటే అల్లరి చేసే వయసు.. కానీ ఓ బాలుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాడో చూస్తే ఆశ్చర్యపోతారు. తుపాను గాలికి తల్లి దుకాణం పడిపోకుండా రక్షించడానికి ప్రయత్నించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ వీడియో చూసి ముచ్చటపడిన నాగాలాండ్ మంత్రి టెంజెన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Real Hero : తుపాను గాలికి తల్లి దుకాణం పడిపోకుండా కాపాడిన బాలుడు.. నిజంగా రియల్ హీరో

Real Hero

Updated On : May 18, 2023 / 7:45 PM IST

boy protected his mother’s shop went viral : భయంకరంగా తుపాను గాలి వీస్తోంది. అందరూ పరుగులు తీస్తున్నారు. ఓ బాలుడు మాత్రం అస్సలు భయపడకుండా తల్లి దుకాణం పడిపోకుండా కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడు.
నాగాలాండ్ టూరిజం మంత్రి టెంజెన్ షేర్ చేసిన ఈ వీడియో అందరి మనసుల్ని దోచుకుంది. ఆ బాలుడిని ‘రియల్ హీరో’ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు.

Temjen Imna: అందమైన అమ్మాయిలతో నాగాలాండ్ మంత్రి గ్రూప్ ఫోటో.. ఆయన చూపులు మాత్రం..

గట్టిగా గాలి వేస్తే పిల్లలు భయంతో లోపలికి పరుగులు పెడతారు. కానీ ఓ బాలుడు తన తల్లికి సాయం చేసాడు. తుపాను గాలికి తమ దుకాణం పడిపోకుండా కాపాడటానికి ప్రయత్నించాడు. గాలికి ఎగిరిపోయిన కుర్చీని తీసుకువచ్చాడు. అల్లరి చేసే వయసులో బాధ్యతగా ప్రవర్తించిన ఆ బాలుడి పని నాగాలాండ్ మంత్రి టెంజెన్‌ని ఆకట్టుకుంది. అంతే తన స్వంత ట్విట్టర్ అకౌంట్ @AlongImna ద్వారా ఆయన ఈ వీడియోని షేర్ చేసుకున్నారు. ‘పరిస్థితులు వయస్సు కంటే ముందు బాధ్యతల్ని నేర్పుతాయి’ అనే శీర్షికతో ఆయన పోస్ట్ చేసిన వీడియో చూసి జనం బాలుడిని ఎంతో మెచ్చుకుంటున్నారు.

Boy Dead : చాక్లెట్ దొంగిలించాడని బాలుడిని కొట్టిన మాల్ మేనేజర్.. కాసేపటికే ఊహించని ఘోరం

టెంజెన్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. తమ రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలను పోస్ట్ చేస్తూ అందరికి టచ్‌లో ఉంటారు. ఎప్పుడూ పెట్టే పోస్టులకు భిన్నంగా ఈసారి ఆయన పెట్టిన పోస్ట్ చాలామంది మనసుల్ని హత్తుకుంది. ఈ పోస్ట్ పై చాలామంది యూజర్లు స్పందించారు. ‘లవ్లీ షేర్ మిస్టర్ టెంజెన్‌’ అని.. ‘స్కూళ్లలో చెప్పని కొన్ని పాఠాలు జీవితం చెబుతుంది’ అని కామెంట్లు పెట్టారు.