Rashmika Mandanna: శ్రీవల్లి కోసం అఖండ డైరెక్టర్ ఆరాటం!

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన, ఆ తరువాత అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను...

Rashmika Mandanna: శ్రీవల్లి కోసం అఖండ డైరెక్టర్ ఆరాటం!

Boyapati Sreenu Approaches Rashmika Mandanna For Next Movie

Updated On : March 15, 2022 / 4:50 PM IST

Rashmika Mandanna: ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన, ఆ తరువాత అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకుంది. ఇక కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ జనాల్లో కూడా అదిరిపోయే ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ, నేషనల్ క్రష్‌గా మారిందంటే ఆమెకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. స్టార్ హీరోలు వరుసగా ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.

Rashmika Mandanna: మాయచేస్తున్న రష్మిక.. హీరోలకు దోస్త్ అయిపోతుంది!

గతేడాది ‘పుష్ప – ది రైజ్’ చిత్రంలో శ్రీవల్లి అనే డీగ్లామర్ పాత్రలో నటించి ప్రేక్షకులను తన నటనతో ఇంప్రెస్ చేసిన ఈ బ్యూటీ, ఇటీవల ‘ఆడావాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాతో మనముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలడంతో ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాలను చాలా సెలెక్టివ్‌గా ఎంపిక చేసుకుంటోంది. ఇక బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్న రష్మిక కోసం తెలుగు స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. తాజాగా ఆమెను తన సినిమాలో తీసుకునేందుకు స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెగ ప్రయత్నిస్తున్నాడట.

బోయపాటి శ్రీను ఇటీవల నందమూరి బాలకృష్ణతో కలిసి ‘అఖండ’ చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్టప్‌తో తన నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు ఈ మాస్ చిత్రాల స్పెషలిస్ట్. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో కలిసి తన నెక్ట్స్ సినిమాను అనౌన్స్ చేసిన బోయపాటి, ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను తీసుకోవాలని చూస్తున్నాడట.

Rashmika Mandanna: ఐటెం సాంగ్ క్రేజ్.. రష్మిక కూడా ఒకే చెప్పేసిందా?

అందుకోసం ఆమె చుట్టూ ప్రదిక్షణలు చేస్తూ ఆమెను ఈ సినిమాలో ఫైనల్ చేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడట. అయితే రష్మిక మందన ఇంకా బోయపాటి శ్రీనుకు డేట్స్ ఇవ్వలేదని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి బోయపాటితో సినిమా చేయడం రష్మికకు ఇష్టం లేదా, లేక డేట్స్ అడ్జస్ట్ కాక ఇలా చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా అఖండ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన బోయపాటి ఇలా రష్మిక కోసం ఆరాటపడటం ఏమిటో అంటున్నారు సినీ క్రిటిక్స్.