Rashmika Mandanna: మాయచేస్తున్న రష్మిక.. హీరోలకు దోస్త్ అయిపోతుంది!

ఎవరితో వర్క్ చేస్తే వాళ్లతో దోస్తీ గట్టిగా కట్టేస్తోంది రష్మికా. అరే వీళ్లతో భలే క్లోజ్ గా ఉంటుందనుకున్న ప్రతీసారి.. నెక్ట్స్ వాళ్లతో.. అంతే ఫ్రెండ్లీ నేచర్ చూపిస్తూ అవాక్కయ్యారా..

Rashmika Mandanna: మాయచేస్తున్న రష్మిక.. హీరోలకు దోస్త్ అయిపోతుంది!

Rashmika Mandanna

Rashmika Mandanna: ఎవరితో వర్క్ చేస్తే వాళ్లతో దోస్తీ గట్టిగా కట్టేస్తోంది రష్మికా. అరే వీళ్లతో భలే క్లోజ్ గా ఉంటుందనుకున్న ప్రతీసారి.. నెక్ట్స్ వాళ్లతో.. అంతే ఫ్రెండ్లీ నేచర్ చూపిస్తూ అవాక్కయ్యారా అంటోంది. సౌత్, నార్త్ అని తనను వేరుచేయద్దొన్న ఈ క్రష్మికా.. తను కూడా ఇండస్ట్రీ వేరియేషన్స్ చూపించకుండా అందరితో కలిసిపోతుంది. అసలైన పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

Rashmika Mandanna: ఐటెం సాంగ్ క్రేజ్.. రష్మిక కూడా ఒకే చెప్పేసిందా?

ఇదీ వరుస.. వరుణ్ ధావన్ తో కలిసి బీస్ట్ అరిబిక్ కుతూ సాంగ్ కి ఫన్నీగా స్టెప్పులేసింది రష్మికా. చివర్లో ఈ హీరోని లైట్ గా టీజ్ కూడా చేసింది. ఓ యాడ్ ఫిల్మ్ కోసం వరుణ్ ధావన్ తో నటించిన నేషనల్ క్రష్.. ఇలా వెంటనే దోస్తీ చేసేసింది. ఫస్ట్ నుంచి ఈమె ఇలాంటి నేచర్ తోనే దూసుకొస్తుంది. ఎవరితో ఏ ప్రాజెక్ట్ చేసినా.. ఆ సినిమా రిలీజయ్యేవరకు వాళ్లతో మంచి బాండింగ్ చూపిస్తోంది. ఇండస్ట్రీ ఏదైనా సరే అక్కడి వారితో ఈజీగా కలిసిపోతుంది.

Rashmika Mandanna : ఉమెన్స్‌డే రోజు బోల్డ్ ఫొటోలతో మ్యాగజైన్ పై రచ్చ చేసిన రష్మిక

పుష్ప ప్రమోషన్స్ లో కూడా ఆ టీమ్ తో రష్మిక ఫుల్ ఫ్రెండ్లీగా మూవ్ అయింది. ఫన్నీగా సందడి చేసింది. పుష్ప రిలీజ్ వరకు హైదరాబాద్, చెన్నై, ముంబై ఇలా ప్రమోషన్ కు వెళ్లిన ప్రతిచోటా రష్మిక మూవ్ మెంట్స్ ప్రేక్షకులను స్పెషల్ గా అట్రాక్ట్ చేసాయి. బన్నీ, సుకుమార్ తోనే కాదు.. దేవీశ్రీప్రసాద్ తో సైతం రష్మిక బాండింగ్ చూసి ఆడియెన్స్ అదుర్స్ అన్నారు. సరిలేరు నీకెవ్వరు టైమ్ నుంచే దేవీశ్రీతో పరిచయమున్న రష్మిక.. ఆడవాళ్లు మీకు జోహార్లు టైమ్ వచ్చేసరికి రెచ్చిపోయింది.