Buddha Venkanna : కొడాలి నానికి పేమెంట్ ఇస్తే మీడియా ముందుకు వస్తాడు.. గంజాయి తాగి చంద్రబాబుపై విమర్శలు : బుద్ధా వెంకన్న

పుంగనూరులో కావాలనే వైసీపీ దాడులు చేసిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి, ఆయనతో ఉన్న అందరికీ దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.

Buddha Venkanna : కొడాలి నానికి పేమెంట్ ఇస్తే మీడియా ముందుకు వస్తాడు.. గంజాయి తాగి చంద్రబాబుపై విమర్శలు : బుద్ధా వెంకన్న

Buddha Venkanna comments Kodali Nani

Updated On : August 8, 2023 / 12:41 PM IST

Buddha Venkanna Comments Kodali Nani : ఏపీ మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని గంజాయి తాగి చంద్రబాబుని విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. కొడాలి నాని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొడాలి నాని మనస్తత్వం నక్క లాంటిదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. పేమెంట్ ఇస్తే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతాడని ఆరోపించారు.

కొడాలి నాని వ్యవహార శైలి నచ్చక ఆయన్ను టీడీపీ నుండి బయటకు పంపేశామని తెలిపారు. ఎన్టీఆర్ కుటుంబంలో తగవులు సృష్టించిన వ్యక్తి కొడాలి నాని అని పేర్కొన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చారు.  పోలవరం 78 శాతం పూర్తి చేసిన చరిత్ర చంద్రబాబుది అని అన్నారు. జలయజ్ఞం ధన యజ్ఞంగా మార్చిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదని విమర్శించారు.

Uniform Civil Code : యూసీసీకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం

పుంగనూరులో కావాలనే వైసీపీ దాడులు చేసిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి, ఆయనతో ఉన్న అందరికీ దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంద్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనని ఎవరైనా అడ్డుకుంటే గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు.