Afghanistan-China : అప్ఘాన్‌కు చైనా భారీ సాయం
ఆప్ఘానిస్తాన్ ను ఆదుకునేందుకు సాయం చేస్తున్నామని చైనా కలరింగ్ ఇస్తున్నప్పటికీ... ఇది ఆ దేశ ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగమనే చర్చ వినిపిస్తోంది.

China Afghanistan
Afghanistan-China: తాలిబన్ల పాలన సాగుతున్న అఫ్ఘానిస్తాన్ కు డ్రాగన్ కంట్రీ చైనా భారీ సాయం అందించింది. ఓవైపు.. అమెరికా అన్నీ సర్దుకుని… అకౌంట్లు బంద్ చేసి వెళ్లిపోయింది. దీంతో… తమను ఆర్థికంగా ఆదుకోవాలని.. పొరుగుదేశాలు, మిత్రదేశాలను ఇప్పటికే అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వ పెద్దలైన తాలిబన్లు కోరారు. దీంతో… ఇప్పటికే పాకిస్తాన్ అండగా ఉంటామని ప్రకటించింది. తాజాగా…. చైనా భారీ ఉద్దీపన సాయం ప్రకటించింది.
Taliban Rule: తాలిబాన్ల కొత్త రూల్ – అనుమతి లేకుండా ఆందోళనలు వద్దు
ఇదీ సాయం : అప్ఘానిస్తాన్ కు 31 మిలియన్ యూఎస్ డాలర్ల(220 మిలియన్ యువాన్లు) ఆర్థిక సాయం ప్రకటించింది చైనా. మన కరెన్సీలో ఇది 223 కోట్ల రూపాయలతో సమానం. అప్ఘానిస్థాన్ లో అస్థిర పరిస్థితులున్నాయని… ఆ దేశాన్ని స్థిరీకరించేందుకు.. కొత్త ప్రభుత్వానికి ఆసరాగా నిలబడేందుకు ఈ మాత్రం సాయం అవసరమని చైనా దేశం బుధవారం ప్రకటించింది.
ఆదుకుంటామన్న డ్రాగన్ : అప్ఘానిస్తాన్ పరిస్థితులపై పొరుగు దేశాల విదేశాంగ మంత్రుల మొదటి సమావేశం బుధవారం (సెప్టెంబర్ 8, 2021) జరిగింది. చైనా, పాకిస్తాన్, ఇరాన్, తజకిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రులు, అధికారులు మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సదస్సులో పాల్గొన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి.. 220 మిలియన్ యువాన్ల సాయం ప్రకటన చేశారు. అప్ఘానిస్తాన్ అత్యవసర అవసరాలైన ఆహారం, ధాన్యం, టీకాలు, మందులు, చలికాలం వాడుకునేందుకు అవసరమైన సామాగ్రి కొనుగోలుకు ఈ నిధులు ఖర్చు చేస్తామన్నారు.
Afghanistan : అఫ్ఘాన్ పరిణామాలపై భారత్‌తో రష్యా, అమెరికా చర్చలు
అఫ్ఘానిస్తాన్ కు 30 లక్షల డోసుల కరోనా టీకాలను కూడా విరాళంగా ఇవ్వనుంది చైనా. దక్షిణాసియా-చైనా దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా.. అప్ఘానిస్తాన్ కు పాండెమిక్ టైం సాయం చేస్తున్నామని తెలిపింది.
ఆప్ఘానిస్తాన్ ను ఆదుకునేందుకు సాయం చేస్తున్నామని చైనా కలరింగ్ ఇస్తున్నప్పటికీ… ఇది ఆ దేశ ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగమనే చర్చ వినిపిస్తోంది.