డ్రాగన్‌పై ఫైర్.. బేగం బజార్‌లో చైనా సరుకులపై నిషేధం!

హైదరాబాద్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో భేగం బజార్ మార్కెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే షాపులు తెరవాలని నిర్ణయించింది. అలాగే సరిహద్దులో చైనా ఆగడాలకు నిరసనగా చైనా వస్తువులను బహిష్కరించాలని నిర్ణయించింది.
బేగం బజార్, సిద్ధి అంబర్ బజార్, ఫీల్ ఖానాల్లో హోల్ సేల్ వ్యాపారం జరుగుతుంటోంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ, ఆంధప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఇక్కడి నుంచే హోల్ సేల్ అంతా రన్ అవుతుంటుంది.
కిరాణంతో పాటు ప్రతిదీ హోల్ సేల్ రన్ అవుతుంది. చైనా ఆగడాలకు నిరసన వ్యక్తం చేస్తూ డ్రాగన్ వస్తువులను బైకాట్ చేయాలని నిర్ణయించినట్టు హైదరాబాద్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాం విలాస్ విహాన్ స్పష్టం చేశారు.
బేగం బజార్‌లో అమ్మకాలు చేయకపోతే తెలంగాణ బ్లాక్ అవుతుందని అసోసియేషన్ తెలిపింది. లాభాల కన్నా తమకు దేశమే ముఖ్యమని స్పష్టం చేసింది. బేగం బజార్‌కు వినియోగదారుల సంఖ్య తగ్గింది. మార్కెట్ పని వేళలలను హైదరాబాద్ మర్చంట్ అసోసియేషన్ కుదించింది.