రామానుజ విగ్రహ ప్రతిష్టకు రండి.. రాష్ట్రపతికి చిన్నజీయర్ ఆహ్వానం.. Photo Gallery
ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాలంటూ.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు చిన్నజీయర్ స్వామి.

140921 Jiyar Swamy Meet President4
హైదరాబాద్ లో తమ ఆశ్రమ సమీపంలో ఏర్పాటుచేసిన రామానుజ విగ్రహ ప్రతిష్టాపనకు రావాలంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులను ఢిల్లీలో ఆహ్వానించారు చినజీయర్ స్వామి. సమతామూర్తి రామానుజ స్వామి వారి 108 అడుగుల అతిపెద్ద పంచలోహ విగ్రహాన్ని ఆశ్రమంలో ఏర్పాటుచేశారు. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు ఇప్పటికే ముహూర్తం కుదిరింది. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2వందల ఎకరాల్లో.. వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.
ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాలంటూ.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు చిన్నజీయర్ స్వామి. ఆయన వెంట శ్రీనివాస రామానుజం, మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు ఉన్నారు.
- రాష్ట్రపతికి చిన్నజీయర్ ఆహ్వానం
- రాష్ట్రపతితో చిన్నజీయర్ సమావేశం
- రామానుజ విగ్రహ ప్రతిష్టాపనకు రండి
- ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ఆహ్వానం
- సమావేశంలో మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు
- ఉపరాష్ట్రపతితో గ్రూప్ ఫొటో
- ఉప రాష్ట్రపతితో మైహోమ్ గ్రూప్ డైరక్టర్ రంజిత్ రావు

ఉప రాష్ట్రపతితో మైహోమ్ గ్రూప్ డైరక్టర్ రంజిత్ రావు