Waltair Veerayya: దేవిశ్రీ వాయింపుడుకు ‘వాల్తేరు వీరయ్య’ ఫుల్ హ్యాపీ..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Waltair Veerayya: దేవిశ్రీ వాయింపుడుకు ‘వాల్తేరు వీరయ్య’ ఫుల్ హ్యాపీ..?

Chiranjeevi Happy With Devisri Prasad Music For Waltair Veerayya

Updated On : November 5, 2022 / 9:46 PM IST

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్ ఇప్పటికే ప్రేక్షకులకు బాగా నచ్చేయడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

Megastar Chiranjeevi : వాల్తేరు వీరయ్యగా మాస్ లుక్‌లో మెగాస్టార్.. బాంబ్ బ్లాస్ట్‌లా పేలిన టైటిల్ టీజర్..

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ మోషన్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై హైప్‌ను మరింత పెంచేశాయి. కాగా,ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఆయన ఇచ్చిన సంగీతం మెగాస్టార్ చిరంజీవికి తెగ నచ్చేసిందట. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉండనుండగా, అన్నీ కూడా అదిరిపోయే విధంగా ఉన్నాయంటూ ఆయన మెచ్చుకున్నారట. కాగా, ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్ కూడా ఉందని.. అది ఈ సినిమాకే హైలైట్‌గా ఉండబోతుందని చిరు భావిస్తున్నాడట.

Chiranjeevi: వాల్తేరు వీరయ్య కోసం 4 వేల మంది విద్యార్ధులు.. ఏం చేశారంటే?

మొత్తంగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం అదిరిపోయే ట్యూన్స్ ఇస్తున్నాడని తెలియడంతో ఈ సినిమా సాంగ్స్ కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.