విక్రమ్ ‘కోబ్రా’ టీజర్ అదిరిందిగా!
Vikram’s Cobra – Teaser: ‘చియాన్’ విక్రమ్ ఎంత కష్టమైనా సరే.. సినిమా కోసం పోషించే పాత్ర కోసం హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తననితాను మలుచుకుంటారు. ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘ఇంకొక్కడు’ ఇలా తన కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్స్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశారు. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’.. ఇటీవల విడుదల చేసిన విక్రమ్ లుక్స్‌కి మంచి రెస్సాన్స్ వచ్చింది.
తాజాగా ‘కోబ్రా’ టీజర్ రిలీజ్ చేశారు. విక్రమ్ ఎప్పటిలానే తన నటనతో అలరించారు. పలు గెటప్స్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. టీజర్ చూశాక తెరమీద ఆయణ్ణి ఎలాంటి డిఫరెంట్ రోల్స్‌లో చూడబోతున్నాం అనే ఎగ్జైట్మెంట్ నెలకొంది. తన మేధాశక్తితో మేథమెటిక్స్‌తో ఎలాంటి సమస్యనైనా సాల్వ్ చేసే జీనియస్‌గా చూపించారు. గెటప్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటున్నాయి.
విక్రమ్ సరసన ‘కే.జి.యఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయిక కాగా ప్రముఖ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏ ఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్, హరీష్ కణ్ణన్ విజువల్స్ అదిరిపోయాయి. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ప్రముఖ దర్శకులు కేఎస్ రవి కుమార్‌తో పాటు రోషన్ మాథ్యూ, ఆనంద్ రాజ్, రోబో శంకర్, మియా జార్జ్, మృణాళిని రవి, మీనాక్షి గోవిందరాజన్ తదితరులు నటించిన ‘కోబ్రా’ చిత్రాన్ని 2021 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.