Cool Drinks : బాబోయ్.. కూల్ డ్రింక్స్‌లో ప్రాణాంతక వైరస్? భయాందోళనలో జనాలు.. ఇందులో నిజమెంత

Cool Drinks : కూల్స్ డ్రింక్స్ లో వైరస్ కలిపారని, కొన్ని రోజుల పాటు శీతల పానీయాలకు దూరంగా ఉండాలని ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా ఓ మేసేజ్ సోషల్ మీడియాలో..

Cool Drinks : బాబోయ్.. కూల్ డ్రింక్స్‌లో ప్రాణాంతక వైరస్? భయాందోళనలో జనాలు.. ఇందులో నిజమెంత

Ebola Virus In Cool Drinks (Photo : Google)

Ebola Virus In Cook Drinks : సోషల్ మీడియా వచ్చాక గందరగోళం బాగా పెరిగిపోయింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ లు ఎక్కువగా వైరల్ అయిపోతున్నాయని నెటిజన్లు అంటున్నారు. ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. అసత్య ప్రచారాలు బాగా స్ప్రెడ్ అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వార్త నిజమో కాదో తెలుసుకోకుండానే జనాలు గుడ్డిగా వాటిని షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయడం చేస్తున్నారు. దాంతో ఫేక్ న్యూస్ ల గోల ఎక్కువైపోయింది. దాంతో పాటే కంగారు, ఆందోళన, భయం పెరిగిపోయింది.

తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనాలను భయాందోళనకు గురి చేసింది. అదేమిటంటే.. కూల్స్ డ్రింక్స్ లో ఎబోలా వైరస్ కలిపారని, కొన్ని రోజుల పాటు శీతల పానీయాలకు దూరంగా ఉండాలని ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా ఓ మేసేజ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మాజా, కోకాకోలా, పెప్సీ, థమ్సప్, స్ప్రైట్, సెవెనప్ వంటి కూల్ డ్రింక్స్ లో కంపెనీలో పనిచేసే కొందరు వ్యక్తులు ప్రమాదకర ఎబోలా వైరస్ ఉన్న రక్తాన్ని మిక్స్ చేశారని ఆ మేసేజ్ సారాంశం. ఈ మేసేజ్ బాగా వైరల్ అయిపోయింది. జనాలను భయబ్రాంతులకు గురి చేసింది. కూల్ డ్రింక్ ప్రియుల్లో కంగారు పుట్టించింది.

Also Read..Viral Video : షాకింగ్.. చేతులు కడుక్కుంటున్న యువకుడిని ఢీకొట్టిన రైలు, స్పాట్‌లోనే మృతి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

చిన్న పెద్ద తేడా లేకుండా కూల్స్ డ్రింక్స్ ఇష్టపడే వారు ఉన్నారు. ఇక సమ్మర్ లో అయితే వీటి సేల్స్ విపరీతంగా పెరుగుతాయి. శీతల పానియాలు ఆరోగ్యానికి మంచివి కాదని చెబుతున్నా.. తాగేవాళ్లు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో కూల్ డ్రింక్స్ గురించి వచ్చిన వార్త తెగ వైరల్ అయ్యింది. అందరినీ భయాందోళనకు గురి చేసింది.

ఇక, ఈ న్యూస్ చివరికి కేంద్రాన్ని కూడా చేరింది. దాంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIBFactCheck వెంటనే స్పందించింది. దీనిపై విచారణ చేసింది. చివరికి.. ఈ మేసేజ్ లో నిజం లేదని తేల్చి చెప్పింది. అది పూర్తిగా ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. కూల్స్ డ్రింక్స్ లో ఎబోలా వైరస్ కలిపారనే ప్రచారాన్ని కేంద్ర సంస్థ కొట్టిపారేసింది.

Also Read.Viral Video : రైల్వే ట్రాక్ కింద పడుకున్న యువకుడు.. వేగంగా దూసుకెళ్లిన ట్రైన్.. వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు

ఈ సందర్భంగా నెటిజన్లకు కేంద్రం పలు కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియాలో వచ్చే అన్ని వార్తలు నిజం కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలనంది. అన్ని వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించింది. గుడ్డిగా మేసేజ్ లను నమ్మేయడం, వాటిని ఫార్వార్డ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. లేదంటే చిక్కుల్లో పడటం ఖాయం అంది. లేనిపోని అపోహలు, అనుమానాలు, భయాలు పెట్టుకోవద్దని చెప్పింది.