Kerala Actress: నటితో పోలీసు అసభ్య ప్రవర్తన.. దర్యాప్తు

మలయాళీ నటి, టీవీ యాంకర్‌తో ఒక పోలీసు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో విచారణ జరుపుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కేరళకు చెందిన ప్రముఖ నటి అర్చనా కవి, ఇటీవల కోచి పట్టణంలో తన స్నేహితురాలు, కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో వెళ్లింది.

Kerala Actress: నటితో పోలీసు అసభ్య ప్రవర్తన.. దర్యాప్తు

Kerala Actress

Updated On : May 25, 2022 / 6:11 PM IST

Kerala Actress: మలయాళీ నటి, టీవీ యాంకర్‌తో ఒక పోలీసు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో విచారణ జరుపుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కేరళకు చెందిన ప్రముఖ నటి అర్చనా కవి, ఇటీవల కోచి పట్టణంలో తన స్నేహితురాలు, కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో వెళ్లింది. రాత్రి పూట కావడంతో ప్యాట్రోలింగ్ నిర్వహిస్తున్న ఒక పోలీసు వాళ్ల ఆటోను ఆపాడు. ఈ సందర్భంగా ఆ పోలీసు తమతో అసభ్యంగా ప్రవర్తించినట్లు, దాంతో తమకు రక్షణ లేదని అనిపించినట్లు అర్చన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ అంశం చర్చకు దారితీసింది.

Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

వెంటనే స్పందించిన పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. పోలీసుతోపాటు, అర్చనతో కూడా దీనిపై చర్చించినట్లు కోచి డిప్యూటీ కమిషనర్ చెప్పారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే, ప్యాట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసు, ఆ నటిని గుర్తుపట్టలేదని, ఆ సమయంలో ఆమె ఫేస్ మాస్క్ పెట్టుకుని ఉందని డీసీపీ చెప్పారు. కాగా, సెలబ్రిటీ అయినా, సాధారణ వ్యక్తి అయినా ఇబ్బందులకు గురైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పుకొచ్చారు. కాగా, అర్చనకు పోలీసులంటే గౌరవం ఉందని, అయితే, తాజాగా జరిగిన ఘటన ఆమెకు బాధ కలిగించిందని డీసీపీ అన్నారు.