’Rajpath’ Renamed  ‘kartavya path’ : రాజ్‌పథ్‌ పేరును, కర్తవ్య‌పథ్‌గా మార్చిన మోడీ ప్రభుత్వం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించేందుకు రెడీ అయ్యింది.దేశ రాజధాని ఢిల్లీలో నడిబొడ్డున నిర్మించిన సెంట్రల్ విస్టాను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సెంట్రలవ్ విస్టా ప్రారంభానికి ముందే మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది మోడీ ప్రభుత్వం. ఏటా గణతంత్ర దినోత్సవం రోజున దేశ సైనిక శక్తి ప్రదర్శనకు వేదికగా నిలిచే ‘రాజ్‌పథ్‌’పేరు మార్చేసింది. రాజ్‌పథ్‌ కు బదులుగా దానికి కర్తవ్యపథ్ గా మార్చింది.

’Rajpath’ Renamed  ‘kartavya path’ :  రాజ్‌పథ్‌ పేరును, కర్తవ్య‌పథ్‌గా మార్చిన మోడీ ప్రభుత్వం

’Rajpath’ Renamed  ‘kartavya path’

Updated On : September 8, 2022 / 1:31 PM IST

’rajpath’ renamed  ‘kartavya path’ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించేందుకు రెడీ అయ్యింది.దేశ రాజధాని ఢిల్లీలో నడిబొడ్డున నిర్మించిన సెంట్రల్ విస్టాను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సెంట్రలవ్ విస్టా ప్రారంభానికి ముందే మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది మోడీ ప్రభుత్వం. ఏడా గణతంత్ర దినోత్సవం రోజున దేశ సైనిక శక్తి ప్రదర్శనకు వేదికగా నిలిచే ‘రాజ్‌పథ్‌’పేరు మార్చేసింది. రాజ్‌పథ్‌ కు బదులుగా దానికి కర్తవ్యపథ్ గా మార్చాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా కర్తవ్యపథ్ పేరు మార్పును ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కు పంపగా ఆమోదం తెలిపింది. ఇండియా గేటు వద్ద ఉన్న నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మార్గం ఈరోజు నుంచి కర్తవ్యపథ్ గా మారింది.

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ను పురస్కరించుకుని దేశంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రధాని మోడీ ప్రభుత్వం. ఇప్పటికే దీనిలో భాగంగానే.. ఇప్పటికే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు మీద ప్రతిష్ఠించిన జాతీయ చిహ్నమైన మూడు సింహాల విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. అదే విధంగా.. ప్రధాని మోడీ ఆగస్టు 15 న తేదీన చేసిన ప్రసంగంలో వలసవాదులు ఏర్పాటు చేసి వెళ్లిన అనేక చిహ్నాలను, మార్పులు చేస్తామని వెల్లడించారు. దీనిలో భాగంగానే ఎర్రకోట సమీపంలోని ‘రాజ్‌పథ్‌’‌ను, కర్తవ్యపథ్‌గా పేరు మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనివెనుక ఉన్న కారణాన్ని మోదీ స్పష్టంగా తెలిపారు. పేరు మార్పుతో ‘రాజ్‌పథ్‌’ కాస్తా నేటి నుంచి కర్తవ్యపథ్ గా మారింది. నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మొత్తం రోడ్డు, ప్రాంతాన్ని కర్తవ్య మార్గంగా పిలుస్తారు.

Also read : Mahua On Rajpath: ప్రధాని నివాసానికి ‘కింకర్తవ్యవిమూఢ మఠ్’ అని పెడతారు.. రాజ్‭పథ్ పేరు మార్పుపై టీఎంసీ సెటైర్లు

దేశ రాజధానిలో అధికారకేంద్రానికి చిరునామాగా ఉంది ‘రాజ్‌పథ్‌’.శతాబ్దాల కాల చరిత్ర ‘రాజ్‌పథ్‌’ సొంతం. మూడు కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ఢిల్లీ అస్థిత్వంతో ముడిపడి ఉంది. వలసవాద పాలకులు మన దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలని నిర్ణయించారు. 1920లో ప్రస్తుత rajpath ను నిర్మించారు బ్రిటీష్ పాలకులు. బ్రిటన్ కు చెందిన నూతన రాజధాని నిర్మాణ శిల్పులు ఇక్కడ సువిశాల గార్డెన్లు, నీటి కాలువలు ఉండేలా డిజైన్ చేశారు.5వ కింగ్ జార్జ్ గౌరవార్ధం దీనికి కింగ్స్ వే అని పేరు పెట్టారు.భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కింగ్స్ వేను రాజ్ పథ్ గా పేరు మార్చారు. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సెంట్రల్ విస్టా పునర్మిణంలో భాగంగా ఈ ప్రాంతంలో పలు మార్పులు చేశారు. ఇటీవల స్వాతంత్ర్య అమతోత్సవాల్లో భాగంగా ప్రధాని మోడీ కొత్త వాదనకు తెరతీశారు. వలసవాద ప్రజాస్వామ్య చిహ్నాలను తొలగించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. దాంట్లో భాగంగానే రాజ్ పథ్ ను కర్తవ్యపథ్ గా మార్చారు.

బ్రిటిష్ వలస పాలకులు, పాలకుల శకం ముగిసిపోయిందని మోదీ అన్నారు. ఇంతకుముందు, మోడీ ప్రభుత్వం నామకరణాన్ని ఎక్కువ మంది వ్యక్తులను కేంద్రీకరించడానికి ఉద్దేశించిన సిద్ధాంతం ప్రకారం, ప్రధానమంత్రి నివాసం ఉన్న రహాదారి పేరు కూడా రేస్ కోర్స్ రోడ్ నుంచి లోక్ కళ్యాణ్ మార్గ్‌గా 2015లో మార్చారు. ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా పేరు మార్చారు. ఇలా ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం పలు పేర్లు మార్పులు చేసింది. చేస్తూ పోతోంది.