Jagame Thandhiram : రెండు క్యారెక్టర్లలో ధనుష్ అదరగొట్టేశాడు..

తమిళ స్టార్ హీరో ధనుష్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘జగమేతంత్రం’..

Jagame Thandhiram : రెండు క్యారెక్టర్లలో ధనుష్ అదరగొట్టేశాడు..

Dhanush Jagame Thandhiram Movie Trailer Tamil

Updated On : June 1, 2021 / 5:21 PM IST

Jagame Thandhiram: తమిళ స్టార్ హీరో ధనుష్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘జగమే తంతిరం’.. ఐశ్యర్య లక్ష్మీ ఫీమేల్ లీడ్‌గా యాక్ట్ చేసిన ఈ సినిమాను ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి నిర్మించాయి. జేమ్స్ కాస్మో, జోజు జార్జ్, కలైయరసన్, సౌందరరాజా, దీపక్ పరమేష్, దేవన్, వడివుక్కరసి తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

మంగళవారం ఈ సినిమా తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ధనుష్ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించారు. ఎప్పటిలానే తన స్టైల్ యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌‌తో ఆకట్టుకున్నారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా కుదిరాయి. జూన్ 18 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ‘జగమే తంతిరం’ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకి సంగీతం : సంతోష్ నారాయణన్, కెమెరా : శ్రేయాస్ కృష్ణ, ఎడిటింగ్ : వివేక్ హర్షన్.