Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కు ఓటేసిన ధనుష్.. ఎవరో తెలుసా?
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న వాతి(తెలుగులో ‘సార్’) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, ధనుష్ తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు.

Dhanush To Act In Venu Udugula Direction
Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న వాతి(తెలుగులో ‘సార్’) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, ధనుష్ తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో ధనుష్ వరుసగా తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
Dhanush Sir Movie : కొంచెం లేటుగా వస్తానంటున్న ‘సార్’..
ఇప్పటికే తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ధనుష్ ఓ సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కించేందుకు శేఖర్ కమ్ముల రెడీ అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయట. అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే, ధనుష్ ఇప్పుడు మరో టాలీవుడ్ డైరెక్టర్‍కు ఓకే చెప్పాడని తెలుస్తోంది.
Dhanush: ధనుష్ మాస్టార్ నా మనసును గెలిచారు అంటున్న సంయుక్తా మీనన్..
నీది నాది ఒకే కథ, విరాటపర్వం వంటి సినిమాలతో తనలోని ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ వేణు ఉడుగుల హీరో ధనుష్‌కు ఓ కథను వినిపించాడట. అయితే దాన్ని పూర్తిగా డెవలప్ చేసి తీసుకుని రమ్మని ధనుష్ సూచించడంతో, ప్రస్తుతం ఆయన స్క్రిప్టు పనులను పూర్తి చేసి, మరోసారి ధనుష్‌కు వినిపించి ఓకే చేయించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాను కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా వరుసగా టాలీవుడ్ డైరెక్టర్లు తమిళ హీరోలతో సినిమాలు చేస్తూ తమ సత్తా చాటుతుండటం నిజంగా విశేషమని చెప్పాలి.