క్వారంటైన్ సమయంలో హెల్దీ పుడ్ తీసుకోవటం లేదంటున్న డైట్ నిపుణులు

  • Published By: srihari ,Published On : June 24, 2020 / 10:27 AM IST
క్వారంటైన్ సమయంలో హెల్దీ పుడ్ తీసుకోవటం లేదంటున్న డైట్ నిపుణులు

Updated On : June 24, 2020 / 10:27 AM IST

కొవిడ్ 19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో ప్రజల ఆహారపు అలవాట్లను చాలా మార్పులకు గురి చేసిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ లాక్ డౌన్ వల్ల ఎక్కువ శాతం ప్రజలు స్నాక్స్, చిప్స్ కు అలవాటు పడ్డారని తెలుస్తోంది.

న్యూయార్క్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. లాక్ డౌన్ సమయంలో ప్రజలు పూట్స్ కన్నా స్నాక్స్ కి ఎక్కువగా కొనుగోలు చేశారని నివేదికలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా మార్చి నుంచి స్నాక్స్, చిప్స్ వంటి ప్రాసెస్డ్ పుడ్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కొనుగొలు జరిగాయి అని నివేదికలు తెలుపుతున్నాయి. క్వారంటైన్ లో అందరూ ఎక్కువగా చిరుతిండిని ఇష్టపడ్డారు. అంతేకాకుండా ప్రాసెస్డ్ పుడ్ చాలా తక్కువ ధరకు లభించటం ఒక కారణం కావచ్చు అని తెలుస్తోంది.

కోవిడ్ 19 తో దేశవ్యాప్తంగా అన్ని మూసివేయటంతో వల్ల చాలా మందిలో నిరుద్యోగ సమస్య రేకెత్తింది. దానితో పాటు ఆర్ధిక సంక్షోభం పెరిగిపోయింది. లాక్ డౌన్ కారణంగా ప్రజలు అవసరానికి మించి వస్తువులను కొనుగొలు చేసి నిల్వ ఉంచారు. అయితే వీటిలో ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారపదార్దాలకు ఎక్కువగా అమ్మకాలు జరిగాయి.  దీని వల్ల భవిష్యత్తులో ఊహించని విధంగా నిరుద్యోగం, అప్పులు పెరిగిపోతాయి. ప్రజలు తయారుగా ఉన్న సూప్స్ వంటి వాటిని కొనుగొలు చేయాలనే నిర్ణయాలను ప్రభావితం చేసే విధంగా మారిపోయింది.

రెస్టారెంట్లు తిరిగి తెరిచినప్పుడు, ప్రజలు దిగ్బంధం సమయంలోని ఆహార పదార్ధాలు చాలా విలువైనవని గుర్తుంచుకోవాలి. త్వరలోనే వాటిని గురించిన అనుభూతిని పొందుతారు. మహమ్మారి తర్వాత ప్రజలు ఆహారపు అలవాట్లు సహజంగానే మారిపోతాయి. మళ్లీ పాస్ట్ పుడ్ ను ఇష్టపడతారు.

Read: కరోనా ఇంజక్షన్ ధర… 5వేల రూపాయలలోపే