Yogi on Caste and Religion: కుల, మతాలుగా విడిపోతే దేశం బలహీనం అవుతుంది: యోగి
భారతదేశ బలం ఐక్యత. దేశ ప్రజల్లో ఉన్న ఐక్యత వల్లే ఈ దేశం ఇంత ద్రుఢంగా ఉంది. మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి మనదేశం తల్లిలాంటిదని దేశంలో 135 కోట్ల ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. అయితే ఈ ఇది మనం ఐక్యంగా ఉన్నంత కాలమే ఉంటుంది. మన మధ్య కులం, మతం, ప్రాంతం, భాష లాంటి బేదాభిప్రాయాలు రానంత వరకు దేశం ఐక్యంగానే ఉంటుంది

Dividing people on cast and religion will weaken country says UP CM
Yogi on Caste and Religion: భారతదేశ బలం ఐక్యతని అయితే దేశ ప్రజలు కుల, మతాలుగా విడిపోతే దేశం బలహీనమవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 1925 ఆగస్టు 9 నాటి కాకోరి సంఘటనను గర్తు చేసుకుంటూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘భారతదేశ బలం ఐక్యత. దేశ ప్రజల్లో ఉన్న ఐక్యత వల్లే ఈ దేశం ఇంత ద్రుఢంగా ఉంది. మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి మనదేశం తల్లిలాంటిదని దేశంలో 135 కోట్ల ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. అయితే ఈ ఇది మనం ఐక్యంగా ఉన్నంత కాలమే ఉంటుంది. మన మధ్య కులం, మతం, ప్రాంతం, భాష లాంటి బేదాభిప్రాయాలు రానంత వరకు దేశం ఐక్యంగానే ఉంటుంది. కానీ అవి పెరిగితే దేశం బలహీనపడుతుంది. స్వాతంత్ర్యం నుంచి మనం సాధించుకున్నది ప్రమాదంలో పడుతుంది’’ అని యోగి అన్నారు.
ప్రస్తుతం మన ముందున్న సవాలు ఏంటంటే.. దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనం కాకుండా చూసుకోవడమేనని యోగి అన్నారు. దేశాన్ని మరింత బలంగా తయారు చేయడానికి ప్రధానమంత్రి 25 ఏళ్ల రోడ్ మ్యాప్‌ను తయారు చేశారని, స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు పూర్తి చేసుకునే వేళ ఈ దేశం మరింత మహోన్నతంగా తయారు అవుతుందని యోగి అన్నారు.
Nitish meets Tejashwi: గతాన్ని మర్చిపోదాం: కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తేజస్వీని బుజ్జగించిన నితీష్