Jaishankar to Europe: రష్యా నుంచి మీరు గ్యాస్ దిగుమతి చేసుకుంటే తప్పు లేదా?: జైశంకర్
యూరప్ సమస్యలే ప్రపంచ సమస్యలుగా ఐరోపా భావిస్తోందంటూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విమర్శలు గుప్పించారు. అయితే, ప్రపంచ సమస్యలను తమ సమస్యలుగా భావించట్లేదని చెప్పారు.

Crude oil imports from Russia
Jaishankar to Europe: యూరప్ సమస్యలే ప్రపంచ సమస్యలుగా ఐరోపా భావిస్తోందంటూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విమర్శలు గుప్పించారు. అయితే, ప్రపంచ సమస్యలను తమ సమస్యలుగా ఐరోపా భావించట్లేదని చెప్పారు. ఈ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. అలాగే, ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో రష్యాకు భారత్ మద్దతు పలుకుతోందని యూరప్ చేస్తోన్న వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
Uttar Pradesh Violence: రాష్ట్రపతి, ప్రధాని పర్యటన రోజే హింస జరగడం దురదృష్టకరం: మాయావతి
రష్యాకు మద్దతు తెలుపుతుండడంతో చైనా-భారత్ మధ్య ఉద్రిక్తతల వేళ ఇండియాకు ప్రపంచ దేశాల మద్దతు లభించదని కొన్ని దేశాలు చేస్తోన్న వ్యాఖ్యలపై కూడా జైశంకర్ స్పందించారు. స్లోవాకియాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జైశంకర్ పాల్గొని మాట్లాడారు. చైనా-భారత్ మధ్య సత్సంబంధాలు సరిగ్గాలేనప్పటికీ ఆ పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యం తమకు ఉందని అన్నారు.
Uttar Pradesh Violence: యూపీలో హింస్మాతక ఘటన కేసు.. 36 మంది అరెస్టు
రష్యాపై ఆంక్షలు విధించామని, ఆ దేశం నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చేయొద్దని యూరప్ అంటోందని జైశంకర్ అన్నారు. అయితే, ఆంక్షలు విధించిన వేళ రష్యా నుంచి యూరప్ మాత్రం గ్యాస్ దిగుమతులు చేసుకోవడం ఏంటని ఆయన నిలదీశారు. రష్యా నుంచి యూరప్ గ్యాస్ కొంటే యుద్ధానికి నిధులు ఇచ్చినట్లు కాదా? భారత్ చమురు కొంటేనే యుద్ధానికి రష్యాకు నిధులు ఇచ్చినట్లా? అని జైశంకర్ ప్రశ్నించారు. భారత వైఖరిని యూరప్ తప్పుగా అర్థం చేసుకుంటోందని ఆయన చెప్పారు.