Dr K Laxman: రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన డా.కె.లక్ష్మణ్

ఉత్తర ప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, మాజీ ఎంపీలు, తెలంగాణ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Dr K Laxman: రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన డా.కె.లక్ష్మణ్

Dr K Laxman

Updated On : July 8, 2022 / 2:19 PM IST

Dr K Laxman: తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత డా.కె.లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తర ప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, మాజీ ఎంపీలు, తెలంగాణ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తనను రాజ్యసభకు ఎంపిక చేసిన జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Sikkim : సిక్కింలో మరో వైరస్ కలకలం ..100 మంది విద్యార్ధుల్లో ఇన్ఫెక్షన్

‘‘తెలంగాణ నుంచి ఎంపికైన నేను ఇక్కడి ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడానికి కృషి చేస్తా. తెలంగాణ వాదనను వినిపించడానికి యూపీ నుంచి నన్ను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఇది తెలంగాణపై జాతీయ నాయకత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. నాలుగు దశాబ్దాలుగా పార్టీలో పని చేస్తున్నా. నాకు దక్కిన రాజ్యసభ అవకాశం కార్యకర్తలకు దక్కిన గుర్తింపు. అనేక పదవుల్లో వెనుకబడిన వర్గాలకు బీజేపీ ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. రాష్ట్రపతి కోటాలో దక్షిణాదికి పెద్దపీట వేస్తూ నలుగురిని రాజ్యసభకు నామినెట్ చేసింది కేంద్రం. పేదలకు ప్రాధాన్యం ఇస్తున్న పార్టీ బీజేపీ’’ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.