Imports From Russia: రష్యా నుంచి భారీగా పెరిగిన దిగుమతులు

రష్యా నుంచి ఇటీవల భారత దిగుమతులు భారీ స్థాయిలో పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. రష్యాపై అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో అక్కడి ఉత్పత్తుల్ని చవకగా కొనేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.

Imports From Russia: రష్యా నుంచి భారీగా పెరిగిన దిగుమతులు

Imports From Russia

Updated On : July 25, 2022 / 9:45 AM IST

Imports From Russia: ఇటీవలి కాలంలో రష్యా నుంచి భారత్ దిగుమతులు భారీగా పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే దిగుమతులు 3.7 రెట్లు పెరిగి 5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ రెండు నెలల కాలంలోనే ఏడాది దిగుమతుల్లో సగం పూర్తైంది.

AP Villages: తెలంగాణలో కలిపే వరకు పోరాటం ఆగదు: ఏపీ విలీన గ్రామాల ప్రజలు

గతేడాది మొత్తం దిగుమతుల విలువ 2.5 బిలియన్ డాలర్లు మాత్రమే కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు జరిగిన దిగుమతుల విలువ మొత్తం 8.6 బిలియన్ డాలర్లు. ముడి చమురుతోపాటు, ఎరువులు, వంట నూనెలు, బొగ్గు వంటి దిగుమతులు భారీ స్థాయిలో పెరిగాయి. మరోవైపు ఖరీదైన రాళ్లు, వజ్రాలు వంటి దిగుమతులు మాత్రం తగ్గాయి. భారత్ నుంచి రష్యాకు ఎగుమతులు తగ్గుతూ ఉంటే, దిగుమతులు పెరుగుతున్నాయి. ఇది రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య లోటును తెలియజేస్తోంది. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో అంతర్జాతీయంగా రష్యాపై ఒత్తిడి పెరగడంతోపాటు, వాణిజ్య పరమైన ఆంక్షలు కొనసాగుతున్న దశలో భారత్ మాత్రం దిగుమతుల్ని పెంచుకుంటోంది.

Partha Chatterjee: అవినీతి మంత్రిని పట్టించుకోని మమత.. ఫోన్ చేసినా స్పందించని సీఎం

పాశ్చాత్య దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు కూడా దిగుమతులు పెరగడానికి కారణం. ఇతర దేశాలు రష్యా ఉత్పత్తుల్ని నిషేధించడంతో మన దేశం ఈ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. తక్కువ ధరలకే ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటోంది. అన్నింటికీ మించి దేశానికి ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతోనే భారత్ దిగుమతుల్ని పెంచుకుంటోంది.