TamilNadu Minister Arrest :మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాడులు..తమిళనాడు మంత్రి అరెస్ట్

మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేశారు. చెన్నైలోని మంత్రి సెంథిల్ బాలాజీ ఇంటి వద్ద 18 గంటలపాటు విచారణ అనంతరం అతన్ని అరెస్టు చేశారు....

TamilNadu Minister Arrest :మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాడులు..తమిళనాడు మంత్రి అరెస్ట్

TamilNadu Minister Arrest

TamilNadu Minister Arrest : మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేశారు. చెన్నైలోని మంత్రి సెంథిల్ బాలాజీ ఇంటి వద్ద 18 గంటలపాటు విచారణ అనంతరం అతన్ని అరెస్టు చేశారు. రాష్ట్ర సెక్రటేరియట్‌లోని సెంథిల్‌బాలాజీ అధికారిక ఛాంబర్‌లో, చెన్నైలోని బంగ్లాతో పాటు కరూర్, కోయంబత్తూరులోని ఆయనకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED officials) అధికారులు సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ కేసులో(money-laundering case) తమిళనాడు మంత్రి వి. సెంథిల్‌బాలాజీని బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేసి, అతన్ని వైద్యపరీక్షల కోసం చెన్నైలోని ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాజువాలిటీ వార్డులో చేర్చారు.

Airfares Decline: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పది డొమెస్టిక్ మార్గాల్లో విమాన చార్జీలు తగ్గుముఖం

మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్‌బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసినట్లు వర్గాలు ధృవీకరించాయి.బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు కారులో తీసుకువెళ్లి అరెస్టు చేశారు. మంత్రి వాహనం వెంట పత్రాలతో కూడిన మరో మూడు వాహనాలు అనుసరించాయి.మంత్రి వి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు విచారణ కోసం తీసుకువెళ్లారని, అతన్ని ఎక్కడికి తీసుకెళుతున్నారో తమకు తెలియదని డీఎంకే రాజ్యసభ ఎంపి ఎన్ఆర్ ఎలాంగో చెప్పారు.సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు ఆయన స్పృహలో లేరని డీఎంకే నాయకుడు ఆరోపించారు.

Nigeria Boat Capsizes: నైజీరియా నదిలో పడవ బోల్తా..103 మంది మృతి

సెంథిల్ బాలాజీ ఇంటిపై మంగళవారం ఉదయం 7 గంటల నుండి బుధవారం తెల్లవారుజామున 2:30 గంటల వరకు ఈడీ దాడులు నిర్వహించింది. ఈడీ అధికారులు మంత్రి స్నేహితులను కలవడానికి కూడా అనుమతించలేదు. అకస్మాత్తుగా 2 గంటలకు అతన్ని నివాసం నుంచి పికప్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినప్పుడు మంత్రి స్పృహలో లేరని తెలుస్తోంది.డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వంలో వి సెంథిల్ బాలాజీ విద్యుత్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. బీజేపీ నాయకత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని, ఈడీ దాడుల వంటి బ్యాక్‌డోర్‌ వ్యూహాల ద్వారా బీజేపీ బెదిరింపులు ఫలించవని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు.