Elephant attack on woman : ఏనుగుతో పరాచకాలు ఆడితే ఇలాగే ఉంటుంది !

సాధారణంగా ఏనుగులు మనుష్యులతో ఫ్రెండ్లీగానే ఉంటాయి. వాటితో ప్రవర్తించే తీరును బట్టి అవి ఒక్కోసారి వయోలెంట్‌గా మారిపోతాయి. రీసెంట్‌గా ఓ మహిళపై ఏనుగు దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Elephant attack on woman : ఏనుగుతో పరాచకాలు ఆడితే ఇలాగే ఉంటుంది !

Elephant attack on woman

Updated On : May 7, 2023 / 11:02 AM IST

Elephant attack on woman :  ఏనుగులు చాలా సాధు స్వభావం కలిగి ఉంటాయి. ఒక్కోసారి మనుష్యుల తుంటరి చేష్టలకి చిర్రొత్తుకొస్తే మాత్రం దాడికి దిగుతాయి. రీసెంట్‌గా ఓ ఏనుగు మహిళపై దాడి చేసిన ఘటన వైరల్ అవుతోంది.

Elephant dance viral : ఏనుగుపై స్వారీ చేసి వాటిని ఇబ్బంది పెట్టకండి.. ఏనుగు డ్యాన్స్ వీడియో చూసి నెటిజన్ల కామెంట్స్

ఏనుగు కనిపించగానే చాలామంది ఇష్టపడతారు. వాటి దగ్గరకి వెళ్లి ముట్టుకున్నా అవి కూడా హాని చేయవు. కానీ వాటిని రెచ్చగొట్టినా.. బెదిరించినా దాడి చేయడానికి వెనుకాడవు. తాజాగా @susantananda3 అనే ట్విట్టర్ యూజర్ ఓ వీడియోను షేర్ చేశారు. ఒక మహిళ ఏనుగుకి అరటిపండు పెట్టడానికి ప్రయత్నించి సరదాగా ఆటపట్టించింది. అంతే ఏనుగుకి విపరీతమైన కోపం వచ్చేసింది. ఒక్కసారిగా కొమ్ములతో ఎత్తి పడేసింది. ఈ ఘటనలో ఆ మహిళకు తీవ్రగాయాలు అయి ఉండొచ్చు. ఈ వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

intelligent elephant : అరటిపండు తొక్క వొలిచి తింటున్న ఏనుగు వీడియో వైరల్

ఏనుగులని మచ్చిక చేసుకుంటే మనుష్యులతో అవి ఎంతో ఆప్యాయంగా ఉంటాయి. ఏ మాత్రం తేడాగా అనిపించినా అవి దాడి చేయడానికి వెనుకాడవు. ఆ మహిళ చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. అందుకే జంతువుల దగ్గరగా వెళ్లినప్పుడు వాటితో ఎంత సరదాగా ఉన్నా ఏమరుపాటుగా ఉంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి.