Manish Sisodia: భారత్‌కు ఇప్పుడు చిన్న దేశాలూ సవాలు విసురుతున్నాయి: సిసోడియా
బీజేపీ వల్ల ఇప్పుడు చిన్న దేశాలు కూడా మహోన్నతమైన భారత్‌కు సవాలు విసురుతున్నాయంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శలు గుప్పించారు. దీంతో ప్రతి భారతీయుడి హృదయం బాధపడుతోందని చెప్పారు.

CBI Raids
Manish Sisodia: బీజేపీ వల్ల ఇప్పుడు చిన్న దేశాలు కూడా మహోన్నతమైన భారత్‌కు సవాలు విసురుతున్నాయంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శలు గుప్పించారు. దీంతో ప్రతి భారతీయుడి హృదయం బాధపడుతోందని చెప్పారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మతో పాటు ఆ పార్టీ నేత నవీన్ కుమార్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) జనరల్ సెక్రటేరియట్ భారత్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
Asaduddin Owaisi: నుపూర్ శర్మను అరెస్టు చేయాల్సిందే: అసదుద్దీన్ ఒవైసీ
సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్, కువైత్ కూడా స్పందిస్తూ.. మత విశ్వాసాలను గౌరవించాలని అన్నాయి. ఈ నేపథ్యంలోనే సిసోడియా ట్విటర్ వేదికగా స్పందించారు. చిన్న దేశాలూ భారత్ ను సవాలు చేస్తున్నాయని, దేశం కోసం మోదీ జీ ఏం చేశారు? బీజేపీ ఏం చేసింది? అని ఆయన నిలదీశారు. కాగా, ఇప్పటికే ఖతార్, కువైత్ తమ దేశాల్లోని భారత దౌత్యాధికారులకు సమన్లు జారీ చేసి, నిరసన వ్యక్తం చేశాయి. కాగా, ఇప్పటికే నురూప్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌ను బీజేపీ పార్టీ పరంగా చర్యలు తీసుకుంది. నురూప్ శర్మపై ముంబైలో కేసు కూడా నమోదైంది.