Budget Hike : సెకండ్ వేవ్ కారణంగా సినిమాలకు పెరుగుతున్న బడ్జెట్.. ఆందోళన చెందుతున్న నిర్మాతలు..

లాస్ట్ ఇయర్ మొత్తం కరోనాకు బుక్ అయ్యిపోవడంతో ఆగిపోయిన సినిమాల్ని, సైన్ చేసిన సినిమాల్ని ఫాస్ట్‌గా కంప్లీట్ చేద్దామనుకున్నారు. కష్టపడి సెట్లేసుకున్నా, షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నా, ఎంత పకడ్భందీగా రిలీజ్ చేద్దామనుకున్నా.. అన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోయాయి. దాంతో అనుకున్నదానికన్నా బడ్జెట్ తడిసిమోపెడవుతోంది..

Budget Hike : సెకండ్ వేవ్ కారణంగా సినిమాలకు పెరుగుతున్న బడ్జెట్.. ఆందోళన చెందుతున్న నిర్మాతలు..

Budget Hike

Updated On : April 22, 2021 / 5:24 PM IST

Budget Hike: లాస్ట్ ఇయర్ మొత్తం కరోనాకు బుక్ అయ్యిపోవడంతో ఆగిపోయిన సినిమాల్ని, సైన్ చేసిన సినిమాల్ని ఫాస్ట్‌గా కంప్లీట్ చేద్దామనుకున్నారు. కష్టపడి సెట్లేసుకున్నా, షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నా, ఎంత పకడ్భందీగా రిలీజ్ చేద్దామనుకున్నా.. అన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోయాయి. దాంతో అనుకున్నదానికన్నా బడ్జెట్ తడిసిమోపెడవుతోంది..

పోయిన సంవత్సరం కరోనా మిగిల్చిన నష్టాల నుంచి తెలుగు సినిమా ఇప్పుడిప్పుడే కోలుకుంటోందనుకునేలోపే మళ్లీ కరోనా సెకండ్ వేవ్ స్టార్టవ్వడంతో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఆంధ్రాలో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంటే, తెలంగా లో మాత్రం ఈ నెలాఖరు వరకూ థియేటర్లు క్లోజ్ చేసేశారు. అటు రెవిన్యూ లేక, సినిమా షూటింగులు జరక్క.. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువై బడ్జెట్ డబుల్, ట్రిపుల్ అవుతోంది మేకర్స్‌కి.

ఇప్పటికే అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం సినిమా షూటింగ్స్ జరక్క షెడ్యూల్స్ అన్నీ పోస్ట్ పోన్ అవుతున్నాయి. కొన్ని షెడ్యూల్స్ క్యాన్సిల్ అయిపోయాయి. దాంతో అన్నీ డబుల్ ఖర్చు అంటున్నారు ప్రొడ్యూసర్లు. షూటింగ్ చేస్తాం కదా అని కోట్లకు కోట్లు పెట్టి సెట్లు వేసి అంతా ఎరేంజ్ చేస్కుకున్న మేకర్స్ ఇప్పుడు కరోనాతో షూటింగ్ కంటిన్యూ చేసే పరిస్థితి లేకపోవడంతో బడ్జెట్ 10 నుంచి 20 పర్సెంట్ పెరుగుతుందని వర్రీ అవుతున్నారు.

సినిమాలు లేట్ అవ్వడంతో ప్రొడక్షన్ కాస్ట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే 50 మందితోనే సినిమా షూటింగ్స్ చేసుకోవాలంటూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ చెప్పేసింది. ఈ 50 మందితో సినిమాలు కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. లిమిటెడ్ యూనిట్‌తో పని చెయ్యాలంటే కష్టంతో పాటు సినిమా షూటింగ్ ఎక్కువ రోజులు చెయ్యాల్సి ఉంటుంది. అంతేకాదు ముందే కోట్లకు కోట్లకు ఫైనాన్స్ తెచ్చి సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్లంతా బడ్జెట్ పెరిగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు..