5 generations : ఐదు జనరేషన్స్ తండ్రులు ఒకే ఫ్రేమ్‌లో.. అద్భుతమైన వీడియో వైరల్

ఒకటి లేదా రెండు జనరేషన్స్ వాళ్లు మాత్రమే కలిసి ఉండటం.. ఆరోగ్యంగా ఉండటం మనం చూసి ఉంటాం. 5 తరాల తండ్రులు కలిసి ఉన్న ఓ అరుదైన వీడియోని చూడండి.

5 generations :  ఐదు జనరేషన్స్ తండ్రులు ఒకే ఫ్రేమ్‌లో.. అద్భుతమైన వీడియో వైరల్

5 generations

Updated On : April 24, 2023 / 3:21 PM IST

ఇప్పుడున్న జనరేషన్స్‌కి తాతయ్య, నానమ్మల వరకూ తెలుసు. కానీ 5 తరాల కుటుంబం కలిసి ఉండటమే కాదు.. తండ్రులంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించండి.

Gulam Nabi Azad: గాంధీ కుటుంబంపై గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు

ఒకప్పుడు కుటుంబం అంటే ఇంటి పెద్దలతో పాటు కొడుకులు, కోడళ్లు మనవలు అంతా కలిసి మెలసి ఉండేవారు. ఇప్పుడు ఆ అనుబంధాలే కరువైపోయాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటున్నారు. ఇక బిడ్డలు విదేశాల్లో స్థిరపడితే వారి పిలుపుకోసం తల్లిదండ్రులు తహతహలాడిపోయే పరిస్థితి.  రీసెంట్‌గా 5 తరాల కుటుంబం కలిసి చేసిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. @Enezator అనే ట్విట్టర్ యూజర్ ద్వారా షేరైన ఓ వీడియోలో అందరికంటే చిన్నవాడు మొదటగా తన తండ్రిని పిలుస్తాడు.. అలా వరుసలో వచ్చిన వారంతా తమ తండ్రుల్ని పాపా అని ప్రేమగా పిలుస్తారు. చివరగా వీరంతా ఒకే ప్రేమ్‌లో నిలబడతారు. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా అనిపించిన ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఈ కుటుంబంలో వారంతా ఇన్ని తరాలుగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండటానికి వారి మధ్య ఉన్న అనుబంధాలు.. ప్రశాంతమైన వాతావరణమే కారణమనిపిస్తోంది.

Snake Inside Toilet : బాబోయ్.. టాయ్‌లెట్‌లో భారీ సర్పం, భయపడిపోయిన కుటుంబం

ఇక ఈ వీడియో చూసిన వారంతా సమ్ థింగ్ స్పెషల్ అని.. వీరిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీల్లో అందరూ కలిసి ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా అందరూ పరిష్కరించుకునేవారు. ఏ రకమైన ఒత్తిడులు కూడా ఉండేవి కాదు. చిన్న కుటుంబాల మోజులో పడి ఏ సమస్య వచ్చినా.. ఏ సంతోషం వచ్చినా వారికి వారే అన్నట్లుగా ఉంది నేటి పరిస్థితి. అందరూ కలిసి ఉంటే చాలామంది ఎప్పుడూ గొడవలతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని భావిస్తారు. కానీ సమస్యలు వచ్చినప్పుడు కుటుంబసభ్యులు బాసటగా నిలుస్తారని ఇలాంటి వీడియోల ద్వారా రుజువౌతూ ఉంది.