యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలిసారిగా 4 కరోనా కేసులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలిసారిగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో ఒకే రోజు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముంబై నుంచి వచ్చిన వారికి వైరస్ నిర్ధారణ అయిందని డీఎంహెచ్ ఓ మనోహర్ తెలిపారు. ఆత్మకూర్ మండలం పల్లెర్లలో ఒకే ఇంట్లో ముగ్గురికి సోకినా కరోనా సోకింది. సంస్థాన్ నారాయణపురం మండలంలో మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో జిల్లాలోని ప్రజలు ఉలిక్కిపడ్డారు.
నిన్నటి వరకు ఒక్క కరోనా కేసు లేని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇవాళ పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటివరకు గ్రీన్ జోన్ లో ఉన్న యాదాద్రి జిల్లాలో ఒక్క కేసు లేకుండా గ్రీన్ జోన్ లో ఉన్న పరిస్థితి ఉన్నది. తెలంగాణలో వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఉంది.
అయితే యాదాద్రిలో ఇవాళ నాలుగు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ నాలుగు కేసులు కూడా ముంబై నుంచి తిరిగి స్వస్థలాకు వచ్చిన వలస కార్మికులవని ఇప్పటికే అధికారులు నిర్ధారించారు. ఇటీవల కాలంలో సంస్థాన్ నారాయణ్ పూర్ మండల జనగాంలో ముంబై నుంచి తిరిగి వస్తున్న క్రమంలో హైదరాబాద్ లో టెస్టులు చేసుకోగా ముగ్గురికి పాటిజవ్ అని తేలింది. ఆ తర్వాత వెంటనే అధికార యాంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరెవరూ ముంబై నుంచి తిరిగి వచ్చారో వారందరికీ టెస్టులు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో వారి డేటా తీసుకుని పరిశీలిస్తున్న క్రమంలో జనగాంలో ఒకరికి పాజిటివ్, సంస్థాన్ నారాయణ్ పూర్ మండలం పల్లెర్లలో ఒకే ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే 11 మందిని క్వారంటైన్ కు తరించారు. వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.