Governor Koshyari: కేంద్ర బలగాల్ని సిద్ధంగా ఉంచండి.. కేంద్రానికి మహారాష్ట్ర గవర్నర్ లేఖ

రెబల్ ఎమ్మెల్యేల ఇండ్లు, ఇతర ఆస్తులకు రక్షణ కల్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, పోలీసు శాఖను గవర్నర్ ఇప్పటికే ఆదేశించారు. కోవిడ్ వల్ల ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన గవర్నర్, రాగానే మహారాష్ట్ర సంక్షోభంపై దృష్టి పెట్టారు.

Governor Koshyari: కేంద్ర బలగాల్ని సిద్ధంగా ఉంచండి.. కేంద్రానికి మహారాష్ట్ర గవర్నర్ లేఖ

Governor Koshyari

Governor Koshyari: మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర బలగాల్ని సిద్ధంగా ఉంచాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాష్ట్ర గవర్నర్ బి.ఎస్.కోష్యారి లేఖ రాశారు. మహారాష్ట్రలో శాంతి భద్రతల సమస్య తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు రాసిన లేఖలో కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలు, ఇండ్లపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Droupadi Murmu: ద్రౌపది ముర్ము సొంతూరుకు ఇన్నాళ్లకు కరెంటు సౌకర్యం

ఈ నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేల ఇండ్లు, ఇతర ఆస్తులకు రక్షణ కల్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, పోలీసు శాఖను గవర్నర్ ఇప్పటికే ఆదేశించారు. కోవిడ్ వల్ల ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన గవర్నర్, రాగానే మహారాష్ట్ర సంక్షోభంపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా రెబల్ ఎమ్మెల్యేల ఇండ్లకు రక్షణ కల్పించాల్సిందిగా కోరాడు. కొందరు రెబల్ ఎమ్మెల్యేలు, తమకు పోలీసులు భద్రత ఉపసంహరించుకున్నట్లు ఫిర్యాదు చేయడం వల్ల గవర్నర్ లేఖ రాయాల్సి వచ్చింది. వెంటనే స్పందించిన కేంద్రం.. సీఆర్పీఎఫ్ బలగాలతో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించింది. ప్రస్తుతం గువహటిలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా తిరిగి ముంబై వచ్చే అవకాశం ఉంది. వారికి కూడా రక్షణ కల్పించాలని గవర్నర్ తన లేఖలో కోరాడు. మహారాష్ట్ర చేరుకుని, రాజ్‌భవన్‌లో తనను కలిసేందుకు వచ్చే ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని సూచించారు.

Lung Cancer: విటమిన్ బి12 సప్లిమెంట్లతో లంగ్ క్యాన్సర్ వస్తుందా? స్టడీ ఏం చెబుతోంది..

ఇప్పటికే కేంద్ర బలగాలు నవీ ముంబైలోని తలోజా బేస్ క్యాంపునకు చేరుకున్నాయి. శనివారం పార్టీ జాతీయ కార్యవర్గ జరిగిన సమావేశం తర్వాత ఆదిత్యా థాక్రే మాట్లాడుతూ రెబల్ ఎమ్మెల్యేల ఇండ్ల వద్దకు వెళ్లి, వాళ్లు చేసిన తప్పులను ఎత్తి చూపాల్సిందిగా శివసేన కార్యకర్తలకు సూచించారు. పరోక్షంగా శివసేన కార్యకర్తల్ని రెబల్ ఎమ్మెల్యేల ఇండ్ల వద్దకు వెళ్లి నిరసన తెలపాల్సిందిగా సూచించాడు. ఇది మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.