gujarat assembly elections: బీజేపీ తీర్థం పుచ్చుకున్న హార్దిక్ పటేల్
గుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్ నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గుజరాత్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడం గమనార్హం.

Hardik Patel In Bjp
gujarat assembly elections: గుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్ నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గుజరాత్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడం గమనార్హం. గాంధీ నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో హార్దిక్ పటేల్‌కు కాషాయ కండువా కప్పి ఆ పార్టీ నేతలు ఆహ్వానించారు. అయితే, ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు ఎవ్వరూ పాల్గొనలేదు. దాదాపు మూడేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన హార్దిక్ పటేల్ ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా నిర్ధారణ
కొన్ని నెలల క్రితం కూడా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించిన హార్దిక్ పటేల్ ఇప్పుడు అదే పార్టీలో చేరారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ చెత్త రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడతానని ఆయన గత ఏడాది డిసెంబరులోనూ ట్వీట్ చేశారు. మరోవైపు నేడు బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశారు. కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.