Bihar CM: అందుకే కేంద్రమంత్రి ఆర్సీపీ సింగ్‌కు రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు: నితీశ్

Nitish
Bihar CM: కేంద్ర మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్‌కు జేడీయూ పార్టీ నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నితీశ్ కుమార్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ”రామచంద్ర ప్రసాద్ సింగ్ ఐఏఎస్‌గా ఉన్న సమయంలోనూ మాతో కలిసి పనిచేశారు. ఆయనను మేము ఇప్పటికే రెండు సార్లు రాజ్యసభకు పంపాము. మా పార్టీ జాతీయ అధ్యక్షుడిగానూ ఆయనకు అవకాశం ఇచ్చాం. ఇప్పుడు కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు. ఆయనకు ఇప్పటికే అన్ని అవకాశాలూ దక్కాయి” అని చెప్పారు. ఈ కారణంగానే ఆయనకు మరోసారి రాజ్యసభ టికెట్ ఇవ్వలేదని అన్నారు.
Naveen Patnaik: మోదీని కలవనున్న నవీన్ పట్నాయక్.. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు?
కాగా, రామచంద్ర ప్రసాద్ సింగ్‌కు మూడోసారి రాజ్యసభ టికెట్ ఇవ్వకుండా, ఈ సారి ఆ అవకాశాన్ని ఝార్ఖండ్ జేడీయూ అధ్యక్షుడు ఖీజు మహ్తోకు ఇచ్చారు. దీంతో ఎన్డీఏ, నితీశ్ మధ్య విభేదాలు తలెత్తాయన్న ఊహాగానాలూ మొదలయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికల ముందే ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.