Headless Fish : తల లేని చేప చెరువులో ఈత కొడుతోంది

తల లేకుండా ఏ జీవి అయినా జీవించగలదా? ఓ తల లేని చేప చెరువులో ఈత కొడుతోంది. అదెలా సాధ్యం? ఈ వింత వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

Headless Fish : తల లేని చేప చెరువులో ఈత కొడుతోంది

Headless Fish

Updated On : May 14, 2023 / 11:15 AM IST

Headless fish video goes viral : తల లేకుండా చేప ఉంటుందా? అది చెరువులో ఎలా ఈదగలదు? ఈద గలదు.. ఓ చేప చక్కగా చెరువులో ఈత కొడుతోంది. ఇది ఎలా సాధ్యమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Alligator Gar Fish : బాబోయ్ ఎంత భయంకరంగా ఉందో.. వలకు చిక్కిన వింత చేప, అచ్చం మొసలిలా ఉంది

ఇంటర్నెట్‌లో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో తాజాగా వైరల్ అవుతున్న వాటిలో తల లేకుండా చెరువులో చేప ఈదుతున్న వీడియో ఒకటి. @OTerrifying అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ‘తల లేకుండా ఈత కొడుతోంది’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. ‘నా జీవితంలో నేను చూసిన బెస్ట్ వీడియో’ అని ఒకరు..’ఇది ఏ రకమైన చేప? తల లేకుండా ఎలా జీవించగలదు?’ అంటూ మరొకరు ప్రశ్నించారు. మొత్తానికి ఈ వింత చేప అందరిలో అనేక అనుమానాలు రేకెత్తించింది.

Fish Farming : వేసవిలో చేపల చెరువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అయితే తల లేకుండా కూడా కొంతకాలం చేపలు నీటిలో జీవిస్తూ ఈద గలుగుతాయట. వాటి తోకకు దగ్గరగా ఉండే వెన్నుపాము ద్వారా అలా సాధ్యమట. అవి అటూ ఇటూ కదలడానికి వెన్నుపాము సహకరిస్తుందట. అలా ఏమైనా జరిగి ఈ చేప తల లేకుండా ఈద గలుగుతోందా? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో కింద నెటిజన్లు చర్చించుకుంటున్నారు.