Health Minister Harish Rao : తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు లేవు-మంత్రి హరీష్ రావు

తెలంగాణలో ఇంతవరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.

Health Minister Harish Rao : తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు లేవు-మంత్రి హరీష్ రావు

Health Minister Harish Rao

Updated On : December 13, 2021 / 6:28 PM IST

Health Minister Harish Rao :  తెలంగాణలో ఇంతవరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈరోజు ఆయన హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు ఉస్మానియా ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్ సేవలను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

నీలోఫర్ ఆస్పత్రిలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే వారికి నీలోఫర్ ఆస్పత్రిలో ఆయుష్మాన్ భారత్ పధకంలో భాగంగా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పధకంలో ఉన్న లిమిట్ ను రూ.2 లక్షలనుంచి రూ. 5 లక్షలకు పెంచామని హరీష్ రావు చెప్పారు.  ప్రొఫెసర్‌లు, సీనియర్ వైద్యులు ఓపీ లో పనిచేయాలని, సర్జరీలు చెయ్యాలని సూచించాము….. మాత శిశు… మరణాల సంఖ్యలో తల్లుల మరణాల శాతం 92నుంచి 69కి తగ్గింది… శిశు మరణాలు కూడా తగ్గాయి.. నార్మల్ డెలివరీ లు పెరిగాయని మంత్రి తెలిపారు.
Also Read : First Omicron Death : తొలి ఒమిక్రాన్ మరణం నమోదు.. ఎక్కడంటే..
థర్డ్ వేవ్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందని ప్రచారం జరుగుతోందని దాన్ని ఎదుర్కోటానికి ప్రభుత్వం సిధ్ధంగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆస్పత్రుల్లోని పడకలు, ఐసీయూ పడకలు, మందులు అంశం, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై రేపు అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నామని హరీష్ రావు చెప్పారు.  తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సేవలు అద్భుతంగా అందుతున్నాయని ప్రజలు చెపుతున్నారని…. రాష్ట్రంలోని మిగతా 13 జిల్లాలో సేవలు ప్రారంభించటానికి సిధ్దమవుతున్నామని ఆయన చెప్పారు.