Hearing Loss : సౌండ్ 70 డెసిబెల్స్ మించితే చిన్నారులు, యువకుల్లో వినికిడి లోపాలు
రోజులో 85 డెసిబెల్స్ మించి ఆడియో వింటే ప్రమాద తీవ్రత చాలా ఎక్కవగా ఉంటుందని అమెరికాకు చెందిన చారిటీ సంస్ధ తన పరిశోధనలో తేల్చింది.

సౌండ్ 70 డెసిబెల్స్ కు మించితే చెవులకు ముప్పే!..
Hearing Loss : స్మార్ట్ ఫోను చేతిలో కొచ్చాక మనిషి తీరే మారిపోయింది. ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకుని తనకు నచ్చినట్లుగా జీవితాన్ని గడిపేస్తున్నాడు. చిన్నారుల నుండి పెద్ద వయస్సు వారి వరకు అందరూ సెల్ ఫోన్ విరివిగా వినియోగిస్తున్నారు. మ్యూజిక్, సినిమాలు, ఇలా అనేక కార్యక్రమాలను సెల్ ఫోన్ ద్వారా చూస్తూ, వింటూ కాలం గడిపేస్తున్నాడు. ఆమైకంలో పడిపోయి కాలం కరిగిపోతున్నా తేరుకోలేకపోతున్నాడు. ఇతరుల నుండి ఇబ్బంది లేకుండా సెల్ ఫోన్ కు ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్ తగిలించి చెవులో పెట్టుకుని ఎంజాయ్ చెయ్యటం నేటి తరానికి అలవాటైపోయింది.
ఇంతవరకు బాగానే ఉన్నా అలా హెడ్ ఫోన్స్ తో ఎక్కువ శద్ధాలతో కూడిన మ్యూజిక్ వంటి వాటిని వినటం వల్ల వినికిడి శక్తి కోల్పోవటం ఖాయమంటున్నారు పరిశోధకులు. 70 డెసిబెల్స్ మించి కనుక సౌండ్ ను వినటం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. రోజులో 85 డెసిబెల్స్ మించి ఆడియో వింటే ప్రమాద తీవ్రత చాలా ఎక్కవగా ఉంటుందని అమెరికాకు చెందిన చారిటీ సంస్ధ తన పరిశోధనలో తేల్చింది.
కర్మాగారాల్లో భారీ యంత్రాల మొతల మధ్య గడిపే కార్మికులు పెద్ద వయస్సు వారు 85 డెసిబెల్స్ వరకు సౌండ్ ను వినవచ్చని, చిన్నారులు, యువత మాత్రం 70 డెసిబెల్స్ కన్నా ఎక్కవ శబ్ధాలను వింటే చెవులు వినికిడి శక్తిని తర్వగా కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చారిటీ సంస్ధ క్వైంట్ సభ్యుడు డేనియల్ ఫింక్ తెలిపారు. చిన్నారులు , యువత ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ వినియోగించినా సౌండ్ 70 డెసిబెల్స్ మించకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఉత్తమమని స్పష్టం చేశాడు.