Home Isolation న్యూ రూల్స్ తెలుసుకోండి

  • Published By: madhu ,Published On : July 4, 2020 / 06:40 AM IST
Home Isolation న్యూ రూల్స్ తెలుసుకోండి

Updated On : July 4, 2020 / 10:12 AM IST

కరోనా వైరస్ లక్షణాలు లేని, తక్కువ లక్షణాలున్న రోగులను హోం ఐసోలేషన్ జాబితాలో చేర్చింది కేంద్రం. కరోనా నిర్ధారణ అయినా..ఎక్కువ శాతం రోగుల్లో లక్షణాలు లేకపోవడంతో కేంద్ర ఆరోగ్య శాఖ హోం ఐసోలేషన్ కు సంబంధించి నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 60 ఏళ్లు దాటిన వారు బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, శ్వాస, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్ర పిండాల సమస్యలు ఉన్న వారు కరోనా బారిన పడినప్పుడు హోం ఐసోలేషన్ లో ఉండాలంటే డాక్టర్ అనుమతి తప్పనిసరిగా వెల్లడించింది.

ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉన్న వారు..లక్షణాలు ప్రారంభమై పది రోజులు గడిచినా..వరుసగా మూడు రోజులు జ్వరం లేకుండా ఉన్న వారిని డిశ్చార్జ్ చేసినట్లు భావించాలి.
ఇలాంటి వారు మరో ఏడు రోజులు తమకి తాము ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
కరోనా రోగులకు హోం ఐసోలేషన్ గడువు పూర్తయిన తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదు.

హోం ఐసోలేషన్ ఉన్న సమయంలో కుటుంబసభ్యులతో కలవకపోవడం బెటర్.
హోం ఐసోలేషన్ ఉన్న రోగులకు సంరక్షులు 24 గంటలు అందుబాటులో ఉండాలి.
సంరక్షుడితో పాటు, రోగితో సన్నిహితంగా ఉండేవారు హైడ్రోక్లోరోక్వీన్ మందును ముందు జాగ్రత్తలో భాగంగా వైద్యుడి సూచన మేరకు వాడాలి.
ఆరోగ్య సేతు మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని నిరంతరం దానిని యాక్టివ్ గా ఉంచుకోవాలి.
స్వీయ నిర్భందం నిబంధనలు తప్పకుండా పాటించాలి.

Read:కరోనా వైరస్ మరింత ప్రాణాంతకంగా మారింది.. సైంటిస్టుల హెచ్చరిక!